Revanth Reddy Getup Ganesh: సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ బిగ్ షాక్

హైదరాబాద్‌లో ఆఘపురలో ఫిషరీస్ కమిటీ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ సీఎం రేవంత్ రెడ్డి గెటప్‌లో ఉన్న వినాయక మండపం ఏర్పాటు చేశారు. దీనివల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని, వెంటనే నిమజ్జనం చేయించాలని రాజాసింగ్ పోలీస్ కమీషనర్‌కు విజ్ఞప్తి చేశారు.

New Update
MLA Raja singh

MLA Raja singh

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గెటప్‌లో ఉన్న వినాయక విగ్రహాన్ని ఓ అభిమాని ఏర్పాటు చేశారు. దీంతో ఇది తీవ్ర చర్చకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని గోషామహల్ నియోజకవర్గం ఆఘపురలో ఫిషరీస్ కమిటీ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ ఒక వినాయక మండపం ఏర్పాటు చేశారు. వినాయకుడికి బదులుగా సీఎం రేవంత్  రెడ్డి గెటప్‌లో ఉన్న వినాయకుడిని అక్కడ  ప్రతిష్టించారు. దేవుడి రూపంలో కాకుండా ఇలా రేవంత్ రెడ్డి గెటప్‌ ఉన్న వినాయకుడిని ప్రతిష్టించడం సరికాదని భక్తులు మండిపడుతున్నారు.

ఇది కూడా చూడండి: Khairathabad Ganesh: బడా గణేష్‌కు గవర్నర్ తొలి పూజా.. ఫొటోలు చూశారా?

పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే..

దీనిపై హిందూ సమాజ నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా మండిపడ్డారు. వినాయకుని విగ్రహం ఇలా ఏర్పాటు చేయడం ఏ మాత్రం సరికాదని తెలిపారు. వెంటనే ఆ విగ్రహాన్ని తొలగించే విధంగా చేయాలని పోలీస్ కమీషనర్‌కు రాజా సింగ్ విజ్ఞప్తి చేశారు. దీంతో హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని రాజాసింగ్ అన్నారు. ఈ విగ్రహంపై పలువురు కూడా మండిపడ్డారు. వెంటనే ఆ వినాయకుడిని నిమజ్జనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా విగ్రహం పెట్టి వినాయకుడిని అనుమానించారని పలువురు అంటున్నారు. ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వినాయకుడిని నిమజ్జనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: CM Revanth Reddy : వినాయక చవితి వేడుకల్లో సీఎం రేవంత్‌ కుటుంబం _Photos

Advertisment
తాజా కథనాలు