/rtv/media/media_files/2025/09/20/kadiyam-1-2025-09-20-20-46-07.jpg)
మాజీ మంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(mla kadiyam srihari) కీలక ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తాను తప్పుకుంటానని,మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనన్నారు. ఇవి తనకు చివరి ఎన్నికలని అసెంబ్లీ ఎన్నికలకు ముందే చెప్పానని, ఇప్పుడు కూడా చెబుతున్నానని అన్నారు. తాను ఎవరి మీద వ్యక్తిగత దూషణలకు దిగబోనంటూ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై పరోక్షంగా సెటైర్లు వేశారు కడియం. చిలిపి చేష్టలు లేవు, చిల్లర పనులు చేయను.. తప్పు చేయను తలవంచనన్నారు. ఎక్కడికైనా వెళ్తే నాటుకోడి కూర, బ్లాక్ లేబుల్ మందు అడుగనన్నారు. మిగిలిన భోజనం టిఫిన్ లో పెట్టుకొని తీసుకుపోనని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కడియం తెలిపారు.
Also Read : గూగుల్, యూట్యూబ్‌లో చూసి యువకుడు దారుణం.. సినిమా రేంజ్‌లో ఛేజ్!
21నెలలోనే 1026కోట్ల అభివృద్ధి నిధులు
తాను నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారానని చెప్పిన కడియం.. గత 21 నెలలుగా కాంగ్రెస్ పార్టీ(Congress Party) లోనే ఉన్నానని స్పష్టం చేశారు. 21నెలలోనే 1026కోట్ల అభివృద్ధి నిధులు తీసుకువచ్చానని, ఆ అభివృద్ధి పనుల వివరాలను ప్రజల ముందు పెట్టానని అందులో ఏ ఒక్కటి తప్పని నిరూపించిన దానికి పూర్తి బాధ్యత నాదేనాని తెలిపారు. ఈ 1026కోట్ల అభివృద్ధి నిధులు కేవలం జనవరి 2024 నుండి ఇప్పటి వరకు మంజూరు అయినవి మాత్రమే నని తెలిపారు. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం 3ఏళ్ళు ఉంటుందని, రానున్న 3ఏళ్లలో మరో 2వేల కోట్ల అభివృద్ధి నిధులు తీసుకు వస్తానని హామీ ఇచ్చారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి ఉన్న చెడ్డ పేరును తొలగించి అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గంగా పేరు తెస్తానని వెల్లడించారు. కడియం చేసిన ఈ కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో సంచనలంగా మారాయి.
Also Read : తెలంగాణ ప్రజలకు పండగే పండుగ.. బతుకమ్మ వేడుకల షెడ్యూల్ ఇదే!