/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Harish-Rao-3-jpg.webp)
Harish Rao: కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం దారుణమైన చర్య అని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులు, కేసులు, నిర్బంధాలతో అణిచివేయలేరని ధ్వజమెత్తారు. మీ బెదిరింపులకు
బీఆర్ఎస్ పార్టీ భయపడదని అన్నారు. ప్రజాక్షేత్రంలోనే మిమ్మల్ని ఎండగడతం అని సవాల్ చేశారు. ప్రజల తరఫున నిలదీస్తూనే ఉంటాం అని హెచ్చరించారు.
Also Read: AP Rains: ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో వానలే..వానలు!
పచ్చని పొలాల్లో చిచ్చు...
హరీష్ రావు ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆయన తన ఎక్స్ ఖాతాలో.. " మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారిని అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటు. పచ్చని పొలాల్లో ఫార్మసిటీ పేరిట చిచ్చు పెట్టడమే మీ ప్రజాపాలనా?
Also Read: Jharkhand Elections:జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభం
నడి రాత్రి రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడమే మీ ఇందిరమ్మ రాజ్యమా?.. ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులు, కేసులు, నిర్బంధాలతో అణిచివేయలేరు. మీ బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదు. ప్రజాక్షేత్రంలోనే మిమ్మల్ని ఎండగడతం. ప్రజల తరఫున నిలదీస్తూనే ఉంటాం. అరెస్టు చేసిన పట్నం నరేందర్ రెడ్డి గారిని, రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం." అని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారిని అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
— Harish Rao Thanneeru (@BRSHarish) November 13, 2024
పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటు.
పచ్చని పొలాల్లో ఫార్మసిటీ పేరిట చిచ్చు పెట్టడమే మీ ప్రజాపాలనా?…
Also Read: Train Accident: పెద్దపల్లి సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్...!
Also Read: నేడు అసెంబ్లీలో 3 బిల్లులు ప్రవేశ పెట్టనున్న ఏపీ ప్రభుత్వం