Jharkhand Elections:జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభం

జార్ఖండ్‌లో రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా ఈ రోజు తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 81 స్థానాల్లో ఈ రోజు 43 స్థానాలకు పోలింగ్ జరగనుంది. రెండో విడత పోలింగ్ నవంబర్ 20న జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న విడుదల కానున్నాయి. 

New Update
Jharkhand

జార్ఖండ్‌లో రెండు దశల్లో ఎన్నికల పోలింగ్‌ను జరగనుంది. ఈ క్రమంలో ఈ రోజు మొదటి దశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 81 స్థానాల్లో ఈ రోజు 43 స్థానాలకు పోలింగ్ జరగనుంది. దీంతో పాటు 10 రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ స్థానాలతో పాటు కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానానికి కూడా పోలింగ్ ప్రారంభమైంది.కాంగ్రెస్‌ పార్టీ నుంచి అగ్రనేత ప్రియాంకా గాంధీ ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. రెండో విడత పోలింగ్ నవంబర్ 20న జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న విడుదల కానున్నాయి. 

ఇది కూడా చూడండి: 10th విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇకపై!

ఇది కూడా చూడండి: పొలిటికల్ పవర్ లిస్ట్‌లో టాప్‌-5లో ఉన్న రాజకీయ నాయకులు వీళ్లే!

భారీ భద్రతల నడుమ పోలింగ్ జరుగుతోంది..

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతలను పోలీసులు ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలోని సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ కావడం...దీంతో సీఎం మారడం వల్ల మళ్లీ గొడవలు జరిగే అవకాశం ఉందని పోలీసులు జాగ్రత్తగా ఉన్నారు. జార్ఖండ్‌‌లో ప్రధానంగా జేఎంఎం–ఇండియా కూటమి, బీజేపీల మధ్య అత్యధిక పోటీ ఉంది. ఈ ఎన్నికల్లో అవినీతి, ప్రజాకర్షక హామీలు, కేంద్ర నిధుల విడుదల లాంటి అంశాలు కీలకంగా నిలిచాయి. 

ఇది కూడా చూడండి: AP Rains: ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో వానలే..వానలు!

ఈసారి ఎన్నికల్లో అన్నింటికంటే సీఎం హేమంత్ సోరెస్ అరెస్ట్, అవినీతి ప్రధానాంశాలుగా నిలిచాయి. దీన్ని ఆసరాగా చేసుకుని జేఎంఎం అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దీంతో పాటూ ఇక్కడ ఆదివాసీ ఓట్లు ఈసారి చీలే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే హేమంత్ సోరెన్ అరెస్ట్ అయి జైలుకి వెళ్ళినప్పుడు చంపయ్ సీఎం అయ్యారు. కానీ హేమంత్ తిరిగి రాగానే ఆయన తన అధికారాన్ని వదలాల్సి వచ్చింది. దీంతో చంపయ్ పార్టీని వదిలి బీజేపీలో జాయిన్ అయిపోయారు. ఈ ఎన్నికల్లో ఇద్దరూ పోటీ చేస్తున్నారు. మరి ప్రజలు ఎవరిని సీఎం పదవిలో కూర్చోపెడతారో చూాడాలి. 

ఇది కూడా చూడండి: Pawan Kalyan: పవన్‌ కు మరో కీలక బాధ్యత అప్పగించిన మోదీ!

Advertisment
Advertisment
తాజా కథనాలు