గాంధీకి ఘోర అవమానం.. ఆకతాయిల పనికి నెటిజన్ల ఫైర్!

గాంధీ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆకతాయిల పనికి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గాంధీ విగ్రహం నోట్లో టపాసులు పెట్టి పేల్చారు. వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

New Update
Gandhi statue,

రోజు రోజుకూ ఆకతాయిల ఆగడాలు పెరిగిపోతున్నాయి. హద్దులు దాటి కొందరు మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. అందులోనూ నేటి యువత ఎక్కువగా సభ్య సమాజం ఛీ కొట్టేలా ఆకతాయి పనులు చేసి సమస్యల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. దీపావళి వేడుక రోజు దేశవ్యాప్తంగా ఘనంగా సంబురాలు జరుపుకున్నారు. కానీ సికింద్రాబాద్ పరిధిలో ఓ యువకుడు చేసిన పనికి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ఇది కూడా చూడండి:  ఉచిత సిలిండర్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి! 

గాంధీ నోట్లో బాంబు

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని కొన్నేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. అయితే దీపావళి రోజు కొందరు యువకులు గాంధీ విగ్రహానికి అవమాన పరిచారు. దీపావళి పండుగ రోజు గాంధీ విగ్రహం సమీపంలో క్రాకర్స్ కాల్చాడానికి కొందరు యువకులు వచ్చారు. అయితే అప్పటి వరకు క్రాకర్స్ కాల్చి సందడి చేశారు.

ఇది కూడా చూడండి: JEE అభ్యర్థులకు అలెర్ట్.. ఈసారి కీలక మార్పులు!

కానీ ఓ యువకుడు మాత్రం చేసిన నిర్వాకం నెట్టింట చక్కర్లు కొడుతుంది. గాంధీ విగ్రహం వద్దకు వెళ్లిన ఓ యువకుడు లక్ష్మీ బాంబును మహాత్ముని నోటిలో పెట్టి నిప్పంటించాడు. ఆపై బాంబు పేలగానే ఆ చుట్టూ ఉన్న వారంతా కేకలు వేయడం ఆ వీడియోలో వినిపిస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. అలా చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

అలాంటిదే మరో వీడియో

ఇది కూడా చూడండి:  శబరిమల యాత్రికులకు శుభవార్త.. ఉచిత బీమా కవరేజీ 

కాగా ఇలాంటిదే ఇటీవలే మరో వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. దివాళీ వేళ ముంబైకి చెందిన ఓ యువకుడు కుక్క తోకకు క్రాకర్స్ కట్టాడు. ఆపై దానికి నిప్పంటించాడు. దీంతో ఆ క్రాకర్ పేలడంతో ఆ కుక్క భయంతో పరుగులు తీసింది. ఈ ఘటనలో ఆ కుక్కకు గాయాలైనట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ఇది కూడా చూడండి: కార్తీకంలో ఈ పనులు చేస్తే.. ముల్లోకాల పుణ్యమంతా మీ సొంతం

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. ఆ యువకుడిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. నోరు లేని మూగ జంతువుపై కర్కశంగా ప్రవర్తించిన ఆ యువకుడిని పట్టుకోవాలని అంటున్నారు. ఆ రాక్షసుడు ఎవరనేది తెలిసేంత వరకు వీడియోను షేర్ చేయాలని కోరుతున్నారు...

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు