ప్రముఖ నటి అరెస్టుకు రంగం సిద్ధం..!

నటి కస్తూరి అరెస్టుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇటీవల తెలుగు మహిళలను కించపరుస్తూ ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తమిళనాడులోని పలు తెలుగు సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో కస్తూరిని అరెస్టు చేయనున్నట్లు సమాచారం.

New Update
KASTURI ARREST

kasturi arrest

kasturi: ప్రముఖ నటి కస్తూరి తెలుగు ప్రజలు గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు నెట్టింట దూమారం రేపుతున్నాయి. ఇటీవలే ఓ ప్రసంగంలో పాల్గొన్న ఆమె వేదిక మాట్లాడుతూ.. అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు  తెలుగు వారు తమిళనాడుకు వచ్చారని.. అలా వచ్చిన వారు ఇప్పుడు తమిళులుగా చలామణి అవుతూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు అంటూ కామెంట్‌ చేసింది. ఈ వ్యాఖ్యలను తమిళనాడులోని పలు తెలుగు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. 

Also Read: సాయి పల్లవి అలా అనడంతో మనసు ముక్కలైంది.. శివ కార్తికేయన్ మాటలు వింటే షాక్

కస్తూరి అరెస్టుకు రంగం సిద్ధం 

తెలుగు మహిళలను కించపరిచేలా మాట్లాడిన కస్తూరిపై చర్యలు తీసుకోవాలని తమిళనాడులోని పలువురు నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నై ఎగ్మూరు పోలీస్‌స్టేషన్‌లో నాలుగు సెక్షన్లతో ఆమె పై కేసులు నమోదయ్యాయి. దీంతో  కస్తూరి అరెస్టుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఏ సమయంలో నైన పోలీసులు ఆమెను అరెస్టు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Also Read: చిరు, నాగ్, వెంకీలో నాకు ఇష్టమైన హీరో అతనే.. బాలయ్య భలే చెప్పాడుగా!

నన్ను క్షమించండి..

ఇది ఇలా ఉంటే నటి కస్తూరి ఇప్పటికే తాను చేసిన వ్యాఖ్యలను  వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించిన లేఖను విడుదల చేసింది. తాను తెలుగు ప్రజల గురించి తప్పుగా మాట్లాడలేదని  క్లారిటీ ఇచ్చింది.  'నేను కుల, ప్రాంతీయ భేదాలకు అతీతంగా జీవించాను. నేను నిజమైన జాతీయవాదిని. తెలుగు ప్రజలు నాకు పేరుతో పాటు ప్రేమ, కీర్తిని అందించారు. కొందరి వ్యక్తుల గురించి మాత్రమే నేను మాట్లాడానని గ్రహించగలరు. తెలుగు సమాజం మొత్తాన్ని ఉద్దేశిస్తూ నేను మాట్లాడలేదు. నా తెలుగు కుటుంబాన్ని నా ఉద్దేశం కాదు..అనుకోని సంఘటనకు నన్ను క్షమించండి" అంటూ లేఖలో రాసింది. ''నేను కుల, ప్రాంతీయ భేదాలకు అతీతంగా జీవించాను. నేను నిజమైన జాతీయవాదిని.

Also Read: ఆమె వీడియో చూడగానే ఏడ్చేసిన సూర్య.. ప్రోమో వైరల్

Also Read: 'బాధ కూడా ఉంది..' ఆ విషయంలో తప్పు చేశా.. సమంత ఎమోషనల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు