Trump-Modi: ఓ మై ఫ్రెండ్‌...అంటూ ట్రంప్‌ కి శుభాకాంక్షలు తెలిపిన మోదీ!

అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ నకు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపర్చడం కోసం, ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం కలిసి పనిచేద్దామని అన్నారు.

New Update
mt

Modi: అగ్రరాజ్యం అమెరికాకు 47 వ అధ్యక్షుడిగా రెండవ సారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌ నకు శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్‌ చేశారు.  ‘‘చారిత్రాత్మక ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకున్న నా ప్రియ మిత్రుడు డొనాల్డ్ ట్రంప్ నకు హృదయపూర్వక అభినందనలు.

Also Read:  ట్రంప్‌ గెలుపు..ఆసక్తికరంగా మస్క్‌ పోస్ట్‌ !

మీ మునుపటి పదవీకాలం విజయాలను మీరు నిర్మించేటప్పుడు, భారత్-యూఎస్ సమగ్ర గ్లోబల్, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మా సహకారాన్ని పునరుద్ధరించడానికి నేను ఎదురు చూస్తున్నాను’’  అంటూ  మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

Also Read:  మరోసారి అగ్రరాజ్యాధినేతగా ట్రంప్‌ 2.o!

ఈనాటి ఈ స్నేహం ఏనాటిదో..

ముందు నుంచి కూడా డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ మధ్య మంచి స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాయి. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ నకు ఓటు వేయాలని ఆ సమయంలో మోదీ బహిరంగంగానే ప్రకటించారు. వారిద్దరి మధ్య బలమైన దౌత్య సంబంధాలు, వ్యూహాత్మక సహకారం, గాఢమైన వ్యక్తిగత స్నేహం కొనసాగుతున్నాయి. 

Also Read: ఒక్క అడుగు...కానీ స్వింగ్‌ స్టేట్స్‌ లోనే అసలు విషయం...!

2019లో హ్యూస్టన్ లో 'హౌడీ మోదీ', 2020లో అహ్మదాబాద్లో 'నమస్తే ట్రంప్' వంటి భారీ కార్యక్రమాల్లో వీరిద్దరు కలిసి పాల్గొని, తమ స్నేహాన్ని ప్రపంచానికి తెలిసేలా చేశారు.  హ్యూస్టన్ లో ఘనంగా జరిగిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమాన్ని ట్రంప్ కొంతకాలం క్రితం కూడా గుర్తు చేసుకున్నారు. 

Also Read:  ఎంగోంగా లిస్ట్‌ లో ఏకంగా అధ్యక్షుడి సోదరి పోలీస్‌ అధికారి భార్య

వ్యూహాత్మకంగా డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ రక్షణ, భద్రత విషయంలో సన్నిహితంగా మెలిగారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇరువురు నేతలు కఠిన వైఖరిని పంచుకున్నారు. ఇది ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు