Telnagana: రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన.. కార్డు లేకున్నా..!

కొత్త రేషన్ కార్డులకు ఎంతమందికి కావాలన్నా కూడా అర్హతను బట్టి ఇస్తున్నామని మంత్రి ఉత్తమ్ అన్నారు. కార్డు లేకపోయినా కూడా లబ్ధిదారుల జాబితాలో పేరు ఉన్నట్లయితే బియ్యం ఇస్తామని తెలిపారు.

New Update
Uttam

Uttam Kumar reddy

మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఉగాది పండుగ రోజున పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు రానుందని తెలిపారు. శుక్రవారం హుజూర్‌నగర్‌లో సన్నబియ్యం పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. '' తెలంగాణలో 85 శాతం జనాభాకు సన్నిబియ్యం అందనుంది. చాలామంది ప్రజలు రేషన్ బియ్యాన్ని వాడటం లేదు. దొడ్డు బియ్యం తినకుండా బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు.      

Also Read: పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేం.. కేంద్రం సంచలన ప్రకటన

బియ్యంతో పాటు త్వరలో పప్పు, ఉప్పు లాంటి వంట సరకులు అందిస్తాం. రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా రేషన్ బియ్యం తీసుకునేలా ఏర్పాటు చేశాం. కొత్త రేషన్ కార్డులకు ఎంతమందికి కావాలన్నా కూడా అర్హతను బట్టి ఇస్తున్నాం. కార్డు లేకపోయినా కూడా లబ్ధిదారుల జాబితాలో పేరు ఉన్నట్లయితే బియ్యం ఇస్తాం. రేషన్ బియ్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రతీ సంవత్సరం రూ.10,665 కోట్లు ఖర్చు చేస్తున్నాయని'' ఉత్తమ్ చెప్పారు.

Also Read: అంబేడ్కర్ జయంతికి పబ్లిక్ హాలీడే.. కేంద్రం అధికారిక ప్రకటన!

ఇదిలాఉండగా.. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి డబుల్ బెడ్‌రూం ఇళ్లపై కీలక ప్రకటన చేశారు. ఇంటిస్థలం లేని అర్హులకు ఇళ్లు కేటాయించాలి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అలాగే అంసపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. ఒకవేళ కాంట్రాక్టర్లు ముందుకు రానట్లయితే లబ్ధిదారులే పూర్తి చేసుకునేలా ఆర్థికసాయం చేస్తామని తెలిపారు. ఇక పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని తెలిపారు. బేస్‌మెంట్ పూర్తి చేసిన లబ్ధిదారులకు మొదటి విడుతలో రూ.లక్ష చెల్లించాలని అధికారులను ఆదేశించారు. 

Also Read: ప్రవీణ్ పోస్టుమార్టం రిపోర్ట్.. షాకింగ్ అనుమానాలు!

Also Read: కుణాల్‌ కామ్రాకు హైకోర్టులో ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు

uttam-kumar-reddy | rtv-news | ration-cards 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు