67 Word: వర్డ్ ఆఫ్ ద ఇయర్ 67..జెన్ ఆల్ఫా తెగ వాడుతున్న ఈ పదం గురించి మీకు తెలుసా?

ప్రముఖ ఆన్‌లైన్ డిక్షనరీ వెబ్‌సైట్‌ ‘డిక్షనరీ.కామ్‌’ ‘67’ను 2025 సంవత్సరానికి వర్డ్ ఆఫ్‌ ద ఇయర్‌ గా ప్రకటించింది.  జెన్ ఆల్ఫా ఎక్కువగా వాడుతున్న ఈ సంఖ్య అర్థం ఏంటో తెలుసా..ఇది ఎందుకింత పాపులర్ అయింది..దీని గురించి కింది ఆర్టికల్ లో..

New Update
67

ఎవరూ పుట్టించినదే కొత్త పదాలు ఎలా వస్తాయి అని ఓ సినిమా డైలాగ్. దీన్నే తూచా తప్పకుండా పాటించేస్తున్నారు జెన్ ఆల్ఫా, బీటాలు. రోజు రోజుకో కొత్త పదాన్ని సృష్టిస్తూ తెగ హడావుడి చేస్తున్నారు. ఇలా పుట్టిన పదమే 67. ఈ ఏడాది మొత్తం ఈ పదాన్ని జెన్ ఆల్ఫా, టీనేజ్ ఎక్కువగా వాడారు. అందుకే దీన్ని ప్రముఖ ఆన్ లైన్ డిక్షనరీ వెబ్ సైట్ డిక్షనరీ .కామ్ 67 ను వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా ప్రకటించింది. 

అలేంటీ పదానికి అర్థం..

67...దీన్ని సిక్సటీసెవెన్ అని చదవకూడాదు. సిక్స్ సెవెన్ అని మాత్రమే చదవాలి. దీనికి అర్థం ఏంటి అంటే ఎవరూ కచ్చితంగా చెప్పలేరు.  నిజానికి సరైన అర్థమే లేదు. ఊరికే సిక్స్ సెవెన్ అంటూ అలా వాడేస్తున్నారు. దీనిని నిర్వచిండం అసాధ్యమి డిక్షనరీ. కామ్ నే చెప్పేసింది. ఇది కేవలం రెడు చేతులతో చేసే సంజ్ఞ మాత్రమే. అమెరికా ర్యాపర్ స్క్రిల్లా పాడిన డ్రిల్ సాంగ్‌ “Doot Doot (6 7)” నుంచి ఈ పదం ఉద్భవించిందని భావిస్తున్నట్లు తెలిపింది. ఆ పాటమొత్తం ‘67’ హుక్ వర్డ్‌గా వినిపిస్తూనే ఉంటుంది.

అయితే జెన్ ఆల్ఫా మాత్రం ఈ పదాన్ని తెగ వాడేస్తున్నారు. స్కూళ్ళల్లో అయితే 67 మారుమోగిపోతూ ఉంటుంది. టీచర్లు పిల్లల చేత దీన్ని వాడకుండా ఆపించడానికి నానా పాట్లు పడుతున్నారు. ఆన్ లైన్ లో కూడా పోస్ట్ లు పెడుతున్నారు. పలువురు దానికి టిప్స్ చెప్పారు. ఇలా ఆన్‌లైన్ సంభాషణలో ఈ వర్డ్ భాగమైంది. దాంతో ఇది విపరీతంగా వైరల్ అయింది. మరోవైపు ఆరాఫార్మింగ్‌, బ్రోలిగార్కీ, ట్రాడ్‌వైఫ్, టారిఫ్‌, ఓవర్‌టూరిజం వంటి పదాలు కూడా షార్ట్‌ లిస్ట్ అయినా 67 ముందు నిలవలేకపోయాయి.  కానీ ఈ పదంపై పెద్దలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్థం లేని పదాలు ఉపయోగిస్తూ భాషను నాశనం చేస్తున్నారని అంటున్నారు. 

Also Read: USA-CHINA: చేతులు కలిపిన అమెరికా, చైనా..టారిఫ్ ల నుంచి ఊరట

Advertisment
తాజా కథనాలు