/rtv/media/media_files/2025/06/11/50ZQeOomFfQdI644J6TB.jpg)
Minister sridhar babu
Duddilla Sridhar Babu : తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు ఘోర అవమానం ఎదురైంది. సీత (షి ఈజ్ ది హీరో ఆల్వేస్ - SITHA) యాప్ ఆవిష్కరణకు వెళ్లిన సందర్భంలో ఆయనకు చేదు అనుభవం చవిచూడాల్సి వచ్చింది. ఈ ఆవిష్కరణ సందర్భంగా ఆయన ప్రసంగిస్తున్న సమయంలో యాంకర్ ఝూన్సీ ఆయన ప్రసంగాన్ని మధ్యలోనే అడ్డుకుంది. దీంతో అసలేం జరుగుతుందో అర్థం కాక మంత్రి శ్రీధర్ బాబు అలాగే ఆగిపోయారు. అయితే సీత యాప్ లాంఛింగ్‌క అతిథిగా విచ్చేసిన సినీ హీరోయిన్ శ్రీలీలను వేదిక మీదకు పిలవడానికి మంత్రి ప్రసంగాన్ని ఆపారని అర్థమై ఆయన కొద్దిసేపు నిశ్చబ్ధంగా ఎండిపోయారు. అంతేకాక పోడియం నుంచి వెనక్కు జరిగారు.
హిరోయిన్ శ్రీ లీల కోసం తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగాన్ని ఆపిన యాంకర్ ఝాన్సీ
— Kumar Reddy.Avula (@Kumar991957) June 10, 2025
శ్రీధర్ బాబు మెత్తని వాడు కాబట్టి ఒప్పుకున్నాడు
అదే ఇగో వున్న ఏ ఇతర మంత్రి అయిన వుంటే పరిస్థితి వేరుగా వుండేది pic.twitter.com/cjpGi2Rd46
శ్రీధర్ బాబు వెనక్కు జరగగానే మైక్ ముందుకు వచ్చిన యాంకర్ ఝాన్సీ మంత్రివర్యులు క్షమించాలి అంటూనే హీరోయిన్ శ్రీలీలను వేదికమీదకు ఆహ్వానించారు. అదే సమయంలో 'షి ఈజ్ ది హీరో ఆల్వేస్' అనే యాప్ లాంఛ్ చేస్తున్నాం. కాబట్టి.. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ శ్రీలీలను స్టేజీపైకి ఆహ్వానిస్తున్నాం అంటూ ఝూన్సీ ఆమెను వేదికమీదకు పిలిచారు. అయితే ఈ విషయంలో మంత్రి శ్రీధర్ బాబు ఏమాత్రం చిరాకుపడకుండా ఆమెను నవ్వుతూ పలకరించడం విశేషం.
Also Read : ఆ కామాంధుడు ట్రంప్‌పై 34 కేసులు.. క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఇదే!!
అయితే ఒక రాష్ట్ర మంత్రి ప్రసంగిస్తుండగా మధ్యలో కలగజేసుకోవడమే కాకుండా ఒక హీరోయిన్ కోసం ఆయన ప్రసంగాన్ని ఆపడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. శ్రీలీల హీరోయిన్ అయితేమాత్రం..మంత్రి ఉపన్యాసాన్ని మధ్యలో ఆపటం సరికాదని, పైగా సీనియర్ యాంకర్ అయిన ఝాన్సీ ఇలా ప్రవర్తించడం దారుణమన్న కామెంట్లు వస్తున్నాయి. ఒక వక్త అందులోనూ మంత్రి ఉపన్యసిస్తున్నపుడు వారిని మధ్యలో ఆపడం అవమానించడమే అవుతుందని ఆరోపిస్తున్నారు. సినిమా వాళ్లు సభా మర్యాద నేర్చుకోవాలని పలువురు సూచిస్తున్నారు... మరో వైపు శ్రీధర్‌బాబు లాంటి కూల్ మంత్రి కనుక ఆయన పెద్దగా రియాక్ట్ కాలేదని, ఇతర మంత్రులు అయితే పరిస్థితి మరోలా ఉండేదని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Covid : భయపెడుతున్న కరోనా భూతం..ప్రధాని కేబినెట్ మీటింగ్ హాజరుకూ పరీక్షలు తప్పనిసరి
Follow Us