Seethakka: ఎందుకు భయపడుతున్నావ్‌ కేటీఆర్‌.. సీతక్క ఫైర్

జైలుకు వెళ్లి యోగా చేస్తానని చెప్పిన కేటీఆర్‌.. ఈ- కార్ రేస్ వ్యవహారంపై ఎందుకు భయపడుతున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. ఒకవేళ తప్పు చేయలేకపోతే విచారణ ఎదుర్కొని నిర్దోషిగా బయటికి రావొచ్చు కదా అని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Seethakka KTR

మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో అంబేద్కర్‌ను, రాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్‌ను అవమానించారంటూ ఆరోపించారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో ఆమె మాట్లాడారు. కేబినెట్ పర్మిషన్ తీసుకొని ఫార్ములా ఈ-కార్ రేసుకు కేటీఆర్‌ డబ్బులు చెల్లించారా అంటూ ప్రశ్నించారు. అసలు సభలో ప్రభుత్వ అనుమతి లేని అంశంపై చర్చ జరపాల్సిన అవసరం ఏముందన్నారు. ఇప్పటికే గవర్నర్ క్లియరెన్స్‌ ఇచ్చిన కేసుకు సభలో చర్చ చేయాల్సిన అవసరం లేదన్నారు. బీఏసీలో ఫార్ములా ఈ-కార్ రేసు మీద చర్చపై బీఆర్‌ఎస్‌ ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ముసుగేసుకొని బీఆర్‌ఎస్‌ రాజకీయం చేస్తోందని విమర్శలు చేశారు. 

Also Read: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. రేవంత్ ను కలిసిన ఇద్దరు ఎమ్మెల్యేలు!

Seethakka Fire On KTR

'' జైలుకు వెళ్లి యోగా చేస్తానని చెప్పిన కేటీఆర్‌ ఇప్పుడు దీనిపై ఎందుకు భయపడుతున్నారు. ఒకవేళ తప్పు చేయలేకపోతే విచారణ ఎదుర్కొని నిర్దోషిగా బయటికి రావొచ్చు కదా ?. కేటీఆర్‌ ఇప్పుడు తన సమస్యను రాష్ట్ర ప్రజల సమస్యగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారు. గతంలో ప్రభుత్వ కేసులు ఎదుర్కొన్న నాయకులు కోర్టుకు వెళ్లడాన్ని తప్పుబట్టిన ఆయన.. మరీ ఇప్పుడు కోర్టును ఎందుకు ఆశ్రయించారు. కేటీఆర్‌కు అసలు నిజాయతీ అనేదే లేదు.

Also Read: ఖమ్మంలో షాకింగ్ ఘటన.. పెళ్లి పేరుతో రూ.40 లక్షలు కొట్టేసిన కిలాడీ! 

రాష్ట్రంలో లక్షలాది రైతులకు ప్రయోజనం చేకూర్చే భూ భారతి బిల్లుపై అసలు చర్చనే జరగకుండా అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారు. వీళ్లు చేసిన కబ్జాల విషయాలు బయటపడతాయనే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు. చట్టం ముందు అందరూ సమానమే. ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్‌ విచారణ ఎదుర్కోవాల్సిందేనని'' సీతక్క అన్నారు. 

Also Read: తెలంగాణలో ఇక ఈ బ్యాంక్ కనిపించదు.. ఏపీలో మాత్రమే!

ఇదిలాఉండగా అసెంబ్లీలో శుక్రవారం గందరగోళం నెలకొంది. ఫార్ములా ఈ-కారు రేసు వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆందోళనలు చేశారు. దీనిపై చర్చ జరపాలంటూ పట్టుబట్టారు. స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లేందుకు యత్నించారు.  ఈ క్రమంలోనే అధికార, విపక్ష నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. 

Also Read: కేసీఆర్ సంచలన నిర్ణయం.. కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పగ్గాలు ఎవరికి?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు