తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆ చట్టం రద్దు

తెలంగాణ ఆర్వోఆర్ -2020 చట్టాన్ని ప్రక్షాళణ చేసి భూభారతిని బిల్లును మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం 33 జిల్లాల ప్రజలు, మేధావుల అభిప్రాయాలతోనే ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

New Update
Ponguleti Srinivasa Reddy

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్వోఆర్ -2020 చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడించారు. పాత ఆర్వోఆర్ చట్టాన్ని రద్దు చేస్తూ.. అసెంబ్లీలో కొత్త ఆర్వోఆర్ బిల్లు‌ను ప్రవేశపెట్టారు.

ఇది కూడా చూడండి: లెస్బియన్స్‌తో సహజీవనం చట్టబద్ధమే.. హైకోర్టు సంచలన తీర్పు

ధరణి స్థానంలో..

దస్త్రాలు, భూయాజమాన్య హక్కుల చట్టం-2024 పేరుతో బిల్లును అసెంబ్లీలో విడుదలు చేశారు. ఇంతకు ముందు ఉన్న ధరణి స్థానంలో భూభారతి పేరుతో కొత్త వ్యవస్థను తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఆధార్ నంబర్ లాగే ప్రతీ భూమికి కూడా భూధార్ కోడ్ ఉంటుందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

ఇది కూడా చూడండి:  ఫార్ములా ఈ రేసు లో ఏసీబీ విచారణ కోరుతూ సిఎస్ శాంతకుమారి ఏసీబీకి లేఖ

ఆర్వోఆర్ యాక్ట్-2020ని ప్రక్షాళణ చేసి భూ భారతిని తెచ్చామన్నారు. మొత్తం 33 జిల్లాల ప్రజలు, మేధావుల అభిప్రాయాలతోనే ఈ బిల్లు నిర్ణయం తీసుకున్నామన్నారు. ధరణి పోర్టల్‌ వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారన్నారు. అందుకే ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో వేసి.. కొత్త చట్టం పొంగులేటి తీసుకొచ్చామన్నారు.

ఇది కూడా చూడండి:  బలపడుతున్న అల్పపీడనం.. మూడు రోజులు అతి భారీ వర్షాలు

18 రాష్ట్రాల్లో ఉన్న ఆర్వోఆర్ చట్టాన్ని అధ్యయనం చేసి భూభారతి అనే కొత్త పోర్టల్‌ను తెచ్చామని పొంగులేటి అన్నారు. రాష్ట్రంలో ప్రతీగ్రామానికి ఓ రెవెన్యూ అధికారిని  నియమిస్తామని, భూ వివాదాలపై అప్పీలుకు ట్రైబ్యునల్‌ కూడా ఏర్పాటు చేస్తామని పొంగులేటి తెలిపారు. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: అంతర్జాతీయ క్రికెట్‌కు ఆర్ అశ్విన్ రిటైర్మెంట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు