Ponguleti Srinivas: తన ఇంటిపై జరిగిన ఈడీ, ఐటీ దాడులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తొలిసారి స్పందించారు. సోమవారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన పొంగులేటి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రైడ్స్ కు సంబంధించి బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై సెటైర్స్ వేశారు. ఈమేరకు బీజేపీ, బీఆర్ఎస్ మంచి దోస్త్. మా ఇంట్లో జరిగిన రెయిడ్స్ కు సంబంధించిన డేటా కావాలంటే బీజేపీని అడిగి బీఆర్ఎస్ రిలీజ్ చేసుకోవచ్చు. నిజంగా బీజేపీ, బీఆర్ఎస్ మాటలు వింటుంటే నాకు నవ్వొస్తుంది. గడిచిన పదేళ్లలో ప్రజలకు ఎలాంటి మేలు చేయని బీఆర్ఎస్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉదంటూ ఎద్దేవా చేశారు.
అధికారం కోసం పాదయాత్ర..
అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు దగ్గరకు వెళ్లని కేటీఆర్ ఇప్పుడు అధికారం కోసం పాదయాత్ర చేస్తారా? ఈ పాదయాత్రనైనా కనీసం ప్రజల కోసం చేస్తే బాగుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడానికి చేస్తే అది తెలివితక్కువ పని అవుతుంది. బీఆర్ఎస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ప్రాంతాలలు, మతాలు, కులాలకు మధ్య చిచ్చులు పెట్టి పబ్బం గడుపుకుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: మీదంతా రిక్రూట్‌మెంట్ మాఫియా.. ఝార్ఖండ్‌లో మోదీ సంచలన ఆరోపణలు!
దేశానికి రోల్ మోడల్ కులగణన..
అలాగే తెలంగాణ కులగణన అంశంపై మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సూచనలతోనే దేశానికి రోల్ మోడల్ కులగణన చేస్తున్నామని చెప్పారు. నవంబర్ ఆఖరులోగా కులగణన పూర్తి చేస్తామన్నారు. ఈ సంక్రాంతి లోపే సర్పంచ్ ఎన్నికలతో పాటు అన్ని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలనే ప్రభుత్వం భావిస్తోందన్నారు. పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నామని పొంగులేటి చెప్పారు.
ఇది కూడా చదవండి: TG News: హైదరాబాద్‌లో విషాదం.. స్కూల్ గేటు మీద పడి విద్యార్థి మృతి