మీదంతా రిక్రూట్‌మెంట్ మాఫియా.. ఝార్ఖండ్‌లో మోదీ సంచలన ఆరోపణలు! ఝార్ఖండ్‌లో జేఎంఎం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం యువతను రిక్రూట్‌మెంట్ మాఫియాకు అప్పగించిందని ప్రధాని మోదీ ఆరోపించారు. పేపర్ లీక్‌లు చేస్తూ నిరుద్యోగుల జీవితాలు నాశనం చేస్తోందని చాయిబస సభలో మండిపడ్డారు. ఝార్ఖండ్‌లో పేదరికాన్ని తాము నిర్మూలిస్తామన్నారు . By srinivas 04 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి PM Modi: ఝార్ఖండ్‌లో జేఎంఎం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం యువతను రిక్రూట్‌మెంట్ మాఫియాకు అప్పగించిందని ప్రధాని నరేంద్ర మోదీ సంచనల ఆరోపణలు చేశారు. పేపర్ లీక్‌లు చేస్తూ నిరుద్యోగుల భవిష్యత్తు నాశనం చేస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చాయిబసలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోదీ.. విపక్షాలపై విరుచుకుపడ్డారు. మాజీ ఎమ్మెల్యే సీతా సోరెన్‌ను అవమానించి కాంగ్రెస్ దేశంలోని మహిళలను కించపరిచిందన్నారు. అలాగే ఆదివాసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎనాడు ఆలోచించలేదన్న ప్రధాని.. ఈ పనిని ఎన్డీయే చేసి చూపించిందన్నారు. ఆదివాసీలపై అనాగరిక నేరాలు.. ఝార్ఖండ్‌లో కాంగ్రెస్, ఆర్జేడీ ఆదివాసీలపై అనాగరిక నేరాలకు పాల్పడ్డాయి. ఝార్ఖండ్ ఏర్పాటును ఆర్జేడీ వ్యతిరేకించింది. ఇప్పుడు జేఎంఎం దాని ఒళ్లో కూర్చొదు. ఈ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకొని చరిత్ర లిఖిస్తాం. పేదల కష్టాలను దగ్గర నుంచి చూశా. పదేళ్లలో పేదల కోసం పథకాలు అమలు చేస్తున్నాం. ఈ పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఆదివాసీ సమాజాన్ని పేదరికంలోనే ఉంచాయి. ఝార్ఖండ్‌లో పేదరిక నిర్మూలనకు బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. ఇది కూడా చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్.. కివీస్ పైనే లాస్ట్ టెస్టు! భూమిని తిరిగి ఇప్పిస్తాం.. ఝార్ఖండ్‌లో బీజేపీ ప్రభుత్వం చొరబాటుదారులను అడ్డుకొనేందుకు తగిన చర్యలు తీసుకుంటుంది. అక్రమంగా గుంజుకున్న భూమిని తిరిగి ఆదివాసీ మహిళల పేర్లపై బదలాయించేలా చట్టాన్ని తీసుకొస్తాం. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు రద్దు చేసి ఓటు బ్యాంకుకు అప్పగించేందుకు ప్రయత్నిస్తోంది. ఝార్ఖండ్ జనాభా మార్చే విషయంలో జేఎంఎం-కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని మోదీ సంచలన ఆరోపణలు చేశారు. ఇది కూడా చదవండి: హోంమంత్రి అనితపై పవన్ సీరియస్.. ఇక ఊరుకోనంటూ.. #jharkand #congress #pm-modi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి