TG News: హైదరాబాద్‌లో విషాదం.. స్కూల్‌ గేటు మీద పడి విద్యార్థి మృతి

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని జిల్లా పరిషత్‌ హైస్కూలు గేటు విరిగి ఒకటో తరగతి విద్యార్థి మృతి చెందాడు. మృతి చెందిన బాలుడు ముదిరాజ్‌ కాలనీకి చెందిన అజయ్(7)గా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

New Update
AP: టీడీపీ నేత దారుణ హత్య.. వేట కొడవళ్ళు, కత్తులతో పొడిచి..

Hyderabad

TG News: స్కూల్‌ గేటు మీద పడి విద్యార్థి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో చోటుచేసుకుంది.  సోమవారం  సాయంత్రం జిల్లా పరిషత్‌ హైస్కూలులో పాఠశాల గేటు విరిగి చిన్నారిపై పడింది.  ఈ ప్రమాదంలో ఒకటో తరగతి విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన బాలుడిని వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. చిన్నారిని పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. మృతి చెందిన బాలుడు ముదిరాజ్‌ కాలనీకి చెందిన అజయ్ (7)గా పోలీసులు గుర్తించారు.

స్కూల్‌ గేటు మీద పడి:

బాలుడి మృతి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. బిడ్డను చూసి గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. స్కూల్‌కి వెళ్లి ఇంటికి తిరిగి రాకుండా బాలుడు మరణించడంలో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆ కాలనీలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చెపట్టారు.

ఇది కూడా చదవండి:  పాలు లేకుండానే వెన్న తయారు చేస్తున్న కంపెనీ

గదిలో విద్యార్థులు ఆడుకుంటుండగా ప్రతిరోజు పడుకునే మంచమే ఆ విద్యార్థి పాలిట యమపాశమైందన్న విషయం తెలిసిందే.  నిన్న జహీరాబాద్‌లో ప్రమాదవశాత్తు ప్రైవేటు పాఠశాల హాస్టల్‌లో మంచం మీద పడి విద్యార్థి మృతి చెందాడు. సాత్విక్ (12) అనే విద్యార్థిపై పడుకునే మంచం తలపై పడటంతో ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా శివరాంపురం గ్రామానికి చెందిన శ్రీకాంత్- సుమలత దంపతులు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని నివాసం ఉంటున్నారు. వీరికి  12 ఏళ్ల సాత్విక్ అనే కుమారుడు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నారు. విద్యార్థుల వసతి గృహంలో విద్యార్థులు ముగ్గురు పడుకునే మంచానికి.. పక్కనున్న మరో మంచానికి తాడును కట్టారు. ఆ తాడుతో సాత్విక్ ఆడుకుంటూ కూర్చొని ఉన్నాడు. మంచం పైనుంచి కిందికి దిగుతున్న సమయంలో సాత్విక్ బోర్లా పడిపోయాడు. స్కూల్ యాజమాన్యం వెంటనే హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి సాత్విక్  అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రికి చేరుకున్న తల్లిదండ్రులు  కొడుకు మరణంతో కన్నీరు మున్నీరుగా విలపించారు.

 



ఇది కూడా చదవండి:  మనిషివా.. రబ్బరు బొమ్మవా?..బాడీని అలా తిప్పావేంటి బ్రో

Advertisment
Advertisment
తాజా కథనాలు