రేపు కేటీఆర్ అరెస్టు.. మరోసారి బాంబు పేల్చిన పొంగులేటి
తెలంగాణ రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కేటీఆర్ అరెస్టు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ను రేపో మాపో అరెస్టు అవుతారని అన్నారు. చట్టం తన పని తాను చేస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణ రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కేటీఆర్ అరెస్టు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ను రేపో మాపో అరెస్టు అవుతారని అన్నారు. చట్టం తన పని తాను చేస్తుందని పేర్కొన్నారు. '' ఈ-కారు రేసు విచారణకు గవర్నర్ పర్మిషన్ ఇచ్చారు. గవర్నర్ అనుమతిని సీఎస్ ఏసీబీకి పంపిస్తారు. చట్టప్రకారమే ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. కేబినెట్‌లో కూడా ఈ-కారు రేసులో గవర్నర్ పర్మిషన్‌పై చర్చ జరిగింది. ఫార్ములా ఈ-రేసులో జరిగిన దోపిడీపై సుదీర్ఘంగా విచారణ జరిగింది. కేటీఆర్ అరెస్టు విషయంలో చట్టం తన పని తాను చేస్తుంది.
ఇటీవల బీఆర్‌ఎస్ నేతలు బాంబు తుస్సుమందని వ్యాఖ్యానించారు. అది తుస్సుమంటే ఢిల్లీ చుట్టూ ఎందుకు ప్రదక్షిణలు చేస్తున్నారు. అసెంబ్లీలో కూడా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గుండాల్లా ప్రవర్తించారు. మాట్లాడటానికి ఏ విషయాలు లేనందువల్లే ప్లకార్డులు, నినాదాలతో అసెంబ్లీ సమావేశాలకు ఆటంకం కలిగించారు. ఈ సమావేశాల్లోనే ఆర్వోఆర్ బిల్లు ప్రవేశపెడతాం. ఇందిరమ్మ పాలనలో కక్ష సాధింపు చర్యలు ఉండవు. అవినీతిని ప్రజల ముందు బయటపెడతామని'' పొంగులేటి అన్నారు.
ఇదిలాఉండగా.. ఈ కారు రేసుపై మంగళవారం ఏసీబీకి సీఎస్ లేఖ రాయనుంది. ఈ రేసింగ్ ఏజెన్సీ, నిర్వాహకులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు సోమవారం సీఎం రేవంత్ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈసమావేశంలో ఐదు కీలక ఆర్డినెన్స్‌కు ఆమోదముద్ర వేశారు. భూమిలేని పేదలకు డిసెంబర్ 28 నుంచి రూ.6 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇప్పటిదాకా రేషన్‌కార్డులు లేనివారికి సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు.

Also Read: వారానికి 70 గంటలు పనిచేయాల్సిందే.. మరోసారి బాంబు పేల్చిన నారాయణమూర్తి
ఇటీవల బీఆర్‌ఎస్ నేతలు బాంబు తుస్సుమందని వ్యాఖ్యానించారు. అది తుస్సుమంటే ఢిల్లీ చుట్టూ ఎందుకు ప్రదక్షిణలు చేస్తున్నారు. అసెంబ్లీలో కూడా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గుండాల్లా ప్రవర్తించారు. మాట్లాడటానికి ఏ విషయాలు లేనందువల్లే ప్లకార్డులు, నినాదాలతో అసెంబ్లీ సమావేశాలకు ఆటంకం కలిగించారు. ఈ సమావేశాల్లోనే ఆర్వోఆర్ బిల్లు ప్రవేశపెడతాం. ఇందిరమ్మ పాలనలో కక్ష సాధింపు చర్యలు ఉండవు. అవినీతిని ప్రజల ముందు బయటపెడతామని'' పొంగులేటి అన్నారు.
Also Read: సోనియా గాంధీ తీసుకున్న నెహ్రూ లేఖలు అప్పగించండి: కేంద్రం