Ponguleti Srinivasa Reddy : పోలీసులపై మంత్రి పొంగులేటి రుసరుస

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి కోపం వచ్చింది. వాట్ ఆర్‌ యూ డూయింగ్.. వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్ అంటూ తీవ్రంగా ఆగ్రహించారు. అది కూడా పోలీసుల మీద. కరీంనగర్ పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటిని పదేపదే తోసివేయడంతో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
Minister Ponguleti Fire on the police

Minister Ponguleti Fire on the police

Minister Ponguleti Srinivasa Reddy : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి కోపం వచ్చింది. వాట్ ఆర్‌ యూ డూయింగ్.. వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్ అంటూ తీవ్రంగా ఆగ్రహించారు. అది కూడా పోలీసుల మీద. కరీంనగర్ పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని పదేపదే తోసివేయడంతో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికారుల తీరుపై మండిపడ్డారు. జిల్లా కలెక్టర్‌పైన పొంగులేటి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వాట్ ఆర్‌ యూ డూయింగ్.. వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్ అంటూ తీవ్రంగా మందలించారు. ఎస్పీ ఎక్కడ అంటూ సీరియస్ అయ్యారు. దీంతో అధికారులంతా అవక్కాయ్యారు. కేంద్ర పట్టణాభివృద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ పర్యటన సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కరీంనగర్‌ వెళ్లారు.  ఈ సందర్భంగా పోలీసులు పదేపదే తోసివేయడంపూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Also Read : మీర్పేట్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్..  కుక్కతో ఆ పని చేయలేదన్న గురుమూర్తి!

కాగా.. కరీంనగర్‌లో శుక్రవారం రోజున పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు కేంద్రమంత్రి మనోహర్ లాల్ కట్టర్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. కాగా ఈరోజు ఉదయం హైదరాబాద్‌‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్డుకు చేరుకున్న కేంద్రమంత్రికి రాష్ట్ర మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక విమానంలో కరీంనగర్‌కు చేరుకున్నారు. కాగా జిల్లా కేంద్రంలో కేంద్రమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.కరీంనగర్‌లో 24 గంటల తాగునీరు, మల్టీ పర్పస్ పార్క్‌ను కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ కట్టర్, బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం కరీంనగర్‌ బైపాస్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన డంప్‌యార్డును పరిశీలించారు. అక్కడి నుంచి హౌజంగ్‌బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడరు. కాగా కేంద్రమంత్రుల వెంట రాష్ర్ట మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.  

Also Read :  భర్తతో విడిపోతున్న మరో హీరోయిన్.. ఫొటోలు డిలీట్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు