కేటీఆర్‌పై కొండ సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలు

మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే పురుగులబడి చస్తారని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు.లగచర్ల ఘటనలో కలెక్టర్‌పై దాడి కేటీఆర్‌ పనేనని ఆరోపించారు. ఈ విషయంలో నిజాలు తేలిన తర్వాతే కేటీఆర్‌పై చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.

ktr konda
New Update

మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే పురుగులబడి చస్తారని వ్యాఖ్యానించారు. అలాగే ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించిన అధికారులను విదేశాల్లో దాచారని ఆరోపణలు చేశారు. బీఆర్‌ఎస్‌ది తుగ్లక్ పాలన అంటూ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ నేతలకు పిచ్చిపట్టిందని.. సైక్రియాటిస్ట్‌కు చూపించుకోవాలంటూ సెటైర్లు వేశారు. అలాగే లగచర్ల ఘటనలో కలెక్టర్‌పై దాడి కేటీఆర్‌ పనేనని ఆరోపించారు. అమాయకులను బలి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో నిజాలు తేలిన తర్వాతే కేటీఆర్‌పై చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. కేసీఆర్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ధ్వజమెత్తారు. 

Also Read: ప్రధాని మోదీకి మరో అత్యున్నత పురస్కారం.. ఈసారి ఎక్కడంటే ?

ఆదివారం కొండా సురేఖ వరంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏడాది పాలన సందర్భంగా హనుమకొండలో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నాం. వరంగల్‌ను తెలంగాణకు రెండో రాజధానిగా చేసేందుకు అడుగులు పడుతున్నాయి. సీఎం రేవంత్ వరంగల్‌ అభివృద్ధిపై దృష్టి సారించారు. గతంలో ఇక్కడ నిర్వహించిన రాహుల్ గాంధీ సభ విజయవంతమైంది. సోమవారం నిర్వహించే ఈ సభకు సీఎం రేవంత్ హాజరవుతారు. సభా వేదికకు ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంగా పేరు పెట్టాం. 

ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఆరింటిలో ఐదు గ్యారెంటీలు అమలు చేశాం. కోటీ మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే రేవంత్ లక్ష్యం. హైదరాబాద్ తర్వాత వరంగల్‌ను అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పారు. వరంగల్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. శతాబ్దాల తర్వాత కులగణన చేపడుతున్నాం. తెలంగాణ వేదికగా దీన్ని నిర్వహించడం చరిత్రలో నిలిచిపోతుంది. రైతుల విషయంలో తమ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. సంక్షేమం, అభివృద్ధితో ముందుకు వెళ్తోంది. గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను దివాళా తీయించిన పరిస్థితుల్లో కూడా రేవంత్ ధైర్యంగా ముందుకెళ్తున్నారని'' కొండా సురేఖ అన్నారు. 

Also Read: బీజేపీకి రాజాసింగ్ గుడ్ బై!

మరోవైపు మంత్రి సీతక్క మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లలో 21 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసిందని అన్నారు. కానీ తమ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే 23 లక్షల మందికి రుణమాఫీ చేశామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా కూడా బీఆర్‌ఎస్‌ అడ్డుకుంటోందని విమర్శించారు. బీఆర్ఎస్‌, బీజేపీలకు రాజకీయాలు తప్ప ప్రజల సంక్షేమం పట్టదంటూ ఎద్దేవా చేశారు. 

#ktr #telugu-news #konda-surekha #telangna
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe