బీజేపీకి రాజాసింగ్ గుడ్ బై! ఎమ్మెల్యే రాజాసింగ్ తీరు మరోసారి BJP పాలిటిక్స్ లో చర్చనీయాంశం అయ్యాయి. తాజాగా బీజేపీ చేపట్టిన పల్లె నిద్ర కార్యక్రమంలో ఆయన పాల్గొనకపోవడం హాట్ టాపిక్ గా మారింది. కీలక కార్యక్రమాలకు దూరంగా ఉంటుండడంతో ఆయన పార్టీ మారే అవకాశం ఉందా? అన్న చర్చ సాగుతోంది. By Nikhil 17 Nov 2024 in తెలంగాణ రాజకీయాలు New Update షేర్ చేయండి తెలంగాణ బీజేపీలో మరోసారి MLA రాజాసింగ్ వ్యవహారంపై చర్చ సాగుతోంది. బీజేపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నిద్రలో రాజాసింగ్ ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. రాజాసింగ్‌ను బీజేపీ నాయకత్వం అస్సలు పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. అంబర్‌పేట్, పాతబస్తీ, బోడుప్పల్ వరకు మూసీ నిద్ర కార్యక్రమం జరిగింది. కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాల్లో రాజా సింగ్ కనిపించడం లేదు. మూసీ నిద్రలో కీలక నేతలంతా పాల్గొన్న రాజా సింగ్ మాత్రం పాల్గొనలేదు. పార్టీపై ఆగ్రహం.. అయితే.. గత కొంత కాలంగా పార్టీ రాష్ట్ర నాయకత్వంపై రాజాసింగ్ గుర్రుగా ఉన్నారు. అసెంబ్లీలో బీజేఎల్పీ పదవిని ఆయన ఆశించి భంగపడ్డారు. 3 సార్లు MLAగా గెలిచినా పట్టించుకోవడం లేదంటూ ఆయన ఫైర్ అవుతున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్‌లో పార్టీ తరఫున గెలిచిన ఏకైక BJP ఎమ్మెల్యే తానని.. ఈ నేపథ్యంలో తనకు కీలక పదవి ఇవ్వాలని ఆయన పార్టీ నాయకత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి తాను అర్హుడినని ఆయన అంటున్నారు. అయితే.. పార్టీలో యాక్టీవ్ గా ఉండకపోయినా కూడా MIMపై సమయం వచ్చినప్పుడుల్లా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. #Raja Singh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి