Kaleshwaram Files : గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలతో తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్.. దీనిపై విచారణకు జ్యుడిషియల్ ఎంక్వయిరీ వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల ముందు కుంగిన మేడిగడ్డ బ్యారేజిపై విచారణను వేగవంతం చేసింది జ్యుడీషియల్ కమిషన్. ఈ క్రమంలో నిన్న విచారణకు అధికారులకు పిలిచింది. అయితే ఈ మేడిగడ్డ బ్యారేజి సంబంధించి క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మాయం అవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది.
Also Read : కల్తీ నెయ్యి గుట్టు విప్పుతున్న సిట్.. ఆ కోణంలో విచారణ!
ముందే ప్రిపేర్ అయ్యి..!
నిన్న విచారణకు వచ్చిన లోవర్ క్యాడర్ ఇంజినీరింగ్ అధికారులు బ్యారేజీ నిర్మాణంలో పాటించిన నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించే రిజిస్టర్లు అందుబాటులో లేవని కమిషన్ ముందు చెప్పారు. వారు చెప్పిన సమాధానం విన్న కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ షాక్ అయ్యారు. అధికారులపై `సీరియస్ అయ్యారు. కీలకమైన ప్రాజెక్ట్ ఫైల్స్ ను జాగ్రత్తగా పెట్టాల్సిన అవసరం లేదని అని ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన ప్రాజెక్ట్ లో అధికారులు ఇంత అజాగ్రత్తగా ఉంటారా? అని నిలదీశారు. కాగా నిన్న ఓపెన్ కోర్టు ద్వారా 18 మంది ఏఈఈ, డీఈఈలను కమిషన్ విచారించింది. కాగా ఈ విచారణలో అధికారులు అంత అడిగిన ప్రశ్నలకు ఒకే విధంగా సమాధానం చెప్పడంపై జస్టిస్ పీసీ ఘోష్ అసహనం వ్యక్తం చేశారు, అందరు ముందే ప్లాన్ చేసుకొని వచ్చి ఒకటే సమాధానం చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ఇలా ఒకే సమాధానం చెప్తే తదుపరి చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.
Also Read : సీఎం పదవికి ఎకనాథ్ షిండే రాజీనామా!
ఫైల్స్ మాయం వెనుక మాజీ మంత్రి?
కాగా మేడిగడ్డ కుంగిపోవడంపై విచారణ జరుగుతున్న సమయంలో మెయింటెనెన్స్ కు సంబంధించిన రిజిస్టర్లు మాయం అవ్వడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. ఈ ఫైల్స్ మాయం కావడం వెనుక ఒక మాజీ మంత్రి హస్తం ఉందనే చర్చ కూడా జోరుగా జరుగుతోంది. ఇంతకు ఆ మాజీ మంత్రి ఎవరు అనే దానిపై నెటిజన్లు ఇంటర్నెట్ లో వెతుకులాట ప్రారంభించారట. కాగా ఇప్పటికే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసు మాజీ సీఎం కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. విచారణకు హాజరైన అధికారులు అంత గత సీఎం చెప్పినట్టే చేశామని జ్యుడీషియల్ కమిషన్ ఎదుట సమాధానాలు చెప్పి కేసీఆర్ పై నెట్టేసినట్లు సమాచారం. కేసీఆర్ తో పాటు ఆ సమయంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు పేరు కూడా అధికారులు కమిషన్ ముందు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. కాగా ఏ క్షణమైన కేసీఆర్ ను అదుపులోకి తీసుకుంటారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతోంది. ఇదిలా ఉంటే మాయమైన ఫైల్స్ పై కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Also Read : RBI GOVERNOR: ఆర్బీఐ గవర్నర్‌కు గుండెపోటు!
Also Read : POCSO: వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై పోక్సో కేసు నమోదు