Karate Kalyani: బంజారాహిల్స్‌లో మేయర్ భూదందా..కరాటే కళ్యాణి సంచలన ఆరోపణలు

హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై కరాటే కళ్యాణి సంచలన ఆరోపణలు చేశారు. బంజారా హిల్స్ లో  కోట్ల విలువ చేసే 1500 గజాల స్థలాన్ని మేయర్ కాజేసింది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. బంజారాహిల్స్ పెద్దమ్మగుడి స్థలం వివాదం క్రమంలోనే మేయర్‌ భూ దందా వెలుగులోకి వచ్చింది.

New Update
.Karate Kalyani's sensational allegations against Vijayalakshmi

.Karate Kalyani's sensational allegations against Vijayalakshmi

హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి(gadwal vijayalakshmi) పై కరాటే కళ్యాణి సంచలన ఆరోపణలు చేశారు. బంజారా హిల్స్ లో  కోట్ల విలువ చేసే 1500 గజాల స్థలాన్ని మేయర్ కాజేసింది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. బంజారాహిల్స్ పెద్దమ్మగుడి స్థలం విషయంలో గొడవ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మేయర్‌ భూ దందా వెలుగులోకి వచ్చింది.

ఈ సందర్భంగా కరాటే కళ్యాణి(karate-kalyani) మాట్లాడుతూ... 2023లో ఈ స్థలాన్ని మేయర్ విజయలక్ష్మికి రెగ్యులరైజ్ చేశారు..అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతోనే జరిగింది. మేమంతా పెద్దమ్మ గుడి కోసం స్థలాన్ని ఇవ్వమంటే గజానికి 2 లక్షలు చెప్పారు. అలాంటిది గజానికి 350 చొప్పున మేయర్ విజయలక్ష్మి పేరిట ఆ స్థలాన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారు? అంటూ ఆమె ప్రశ్నించింది. గజం రూ.2 లక్షల విలువైన భూమిని..రూ.350కి ప్రభుత్వం ఎలా కేటాయించిందని ఆమె మండి పడ్డారు. అధికారం అడ్డుపెట్టుకుని  మేయర్ చౌకగా భూమిని కొట్టేసిందని ఆరోపించారు. మేయర్ కుటుంబం ఏమైనా పేదరికంలో ఉందా? అంటూ కళ్యాణి ప్రశ్నించారు.మేయర్, ఆమె తండ్రి కేశవరావు ఏమైనా ఫ్రీడమ్ ఫైటర్సా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. త్వరలోనే మేయర్ భూ దందాలన్నీ బయటపెడతానంటూ హెచ్చరించింది.

Also Read :  గణపతి నవరాత్రుల నిర్వాహకులు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే..

Karate Kalyani's Allegations Against Vijayalakshmi

మేయర్ విజయలక్ష్మికి సంబంధించిన అక్రమాలు ఇప్పటికే జర్నలిస్టు మిత్రులు ఎన్నో బయటకు తీసి రాశారని కళ్యాణి గుర్తు చేసింది. కానీ ఇప్పటివరకు ఆమెపై యాక్షన్ తీసుకున్నదే లేదు. అలాగే ఆ మేయర్ ఏమైనా పేద బతుకు బతుకుతోందా..?  మేయర్‌ పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అని, ఆమె చాలా సంవత్సరాల నుండి అక్కడే నివాసం ఉంటుందని రూ.350 చొప్పున 1500 గజాలను రిజిస్ట్రేషన్ చేశారా..? అంటూ కళ్యాణి ఫైర్‌ అయ్యారు. అదే సమయంలో పెద్దమ్మ గుడి(banjara hills peddamma temple issue) కూడా ఆ ప్రాంతంలో గడచిన 70,80 ఏండ్ల నుండి అక్కడే ఉంటుంది. అలాంటిది పెద్దమ్మ గుడికి స్థలాన్ని ఎందుకు కేటాయించరు అంటూ ఆమె ప్రశ్నించింది..సంపన్నుల కుటుంబానికి చెందిన మేయర్ విజయలక్ష్మికి తక్కువ ధరకు స్థలం ఎలా కేటాయిస్తారు..అంటూ ప్రశ్నించింది. ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వ అండదండలు చూసుకుని రిజిస్ట్రేషన్ చేశారు. పెద్దమ్మ గుడికి స్థలాన్ని కేటాయించమంటే మా మీద రాళ్లు రువ్వుతారు. ఇంట్లో నుండి రానివ్వకుండా హౌస్ అరెస్టు చేస్తారు. మరి ఆమెకి ఎలా స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశారని కళ్యాణి ఫైర్‌ అయ్యారు.

తక్షణమే ఈ విషయపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. 1000 గజాల స్థలాన్ని పెద్దమ్మ గుడికి ఇవ్వమంటే ఇవ్వలేదు. కానీ 2023లో  తెలంగాణ ప్రభుత్వం మేయర్ గద్వాల విజయలక్ష్మికి స్థలం కేటాయించగా తన పేరు మీద ఆ స్థలాన్ని రెగ్యులరైజ్ చేసుకుంది" అంటూ ఆధారాలతో సహా బయటపెట్టారు కరాటే కళ్యాణి.  ప్రస్తుతం కరాటే కళ్యాణి ఆధారాలతో సహా ఈ భూ దందా ఇష్యూ ని బయటికి తీయడంతో ఈ విషయం కాస్త మీడియాలో వైరల్ గా మారింది.మరి కరాటే కళ్యాణి చేసిన ఆరోపణలపై మేయర్ ఏ విధంగా క్లారిటీ ఇస్తుంది.? ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది ?అనేది చూడాలి.

ఇది కూడా చూడండి:Crime News: మరో భర్త బలి.. మరిగే నూనె పోసి అతి కిరాతంగా హత్య చేసిన భార్య

Advertisment
తాజా కథనాలు