TG CRIME: పెళ్లి చేసుకున్న ప్రేమజంట..పోలీస్‌ స్టేషన్‌లో ఉరికించి ఉరికించి....

పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ప్రేమ జంటపై దాడి జరిగింది. బుధవారం సాయంత్రం వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రేమ పెళ్లి వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై అమ్మాయి బంధువులు దాడికి పాల్పడ్డారు.

New Update
Married couple hanged

Married couple hanged

TG CRIME : పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ప్రేమ జంటపై దాడి జరిగింది. బుధవారం సాయంత్రం వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రేమ పెళ్లి వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శాయంపేట మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన యువతి నితీష,  పత్తిపాకకు చెందిన యువకుడు మణిరాజ్ ప్రేమించుకున్నారు. వారం రోజుల క్రితం వారిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు.  ఆ తర్వాత ఆ ప్రేమజంట తమకు రక్షణ కల్పించాలని శాయంపేట పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ఇరు కుటుంబాలను పిలిపించి కౌన్సిలింగ్​ఇచ్చి పంపించారు. 

Also Read: ఈ సాలా కప్ నమ్దే..18 ఏళ్ళ కల... బెంగళూరు రాయల్ విన్నింగ్

దీంతో వివాదం సద్దుమణికింది అనుకున్నారు. ఆ తర్వాత నల్లబెల్లి మండలం శనిగరం గ్రామానికి చెందిన యువకుడి బంధువు సముద్రాల బాలరాజు ప్రేమ జంటను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి బంధువులు సుమారు 50 మంది సాయంత్రం రెండు వాహనాల్లో బాలరాజు ఇంటికి చేరుకుని వారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో  గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆ సమయంలో ప్రేమజంట పారిపోయింది. 

Also Read: కరోనా వైరస్.. ఇప్పుడు కొత్త ఫంగస్.. చైనా రోగాల ఫ్యాక్టరీ గురించి తెలుసా..?

ఈ విషయమై బాలరాజు  ప్రేమజంటను వెంటబెట్టుకుని నల్లబెల్లి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్ కు వెళ్లారు.  దీంతో యువతి బంధువులు మరోసారి సుమారు 50 మంది ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ కు వచ్చారు.  ప్రేమ జంటను బయటకు లాక్కొచ్చి కొడుతుండగా అడ్డుకున్న పోలీసులపైనా పూల కుండీలతో దాడికి పాల్పడ్డారు. దీంతో డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ స్వర్ణ, మరో మహిళ స్వాతి గాయపడడంతో108లో చికిత్స కోసం నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్టేషన్​లో దాడి జరిగిన విషయం తెలియడంతో దుగ్గొండి సీఐ సాయి రమణ వెళ్లి విచారణ చేపట్టారు. కాగా దాడికి పాల్పడిన వారిలో కొంతమందిని గుర్తించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

Also Read: ఫలించిన 18 ఏళ్ళ నిరీక్షణ..మిన్నంటిన ఆర్సీబీ సంబరాలు

Also Read: ఈ సాలా కప్ నమ్దే..18 ఏళ్ళ కల... బెంగళూరు రాయల్ విన్నింగ్

Advertisment
Advertisment
తాజా కథనాలు