సీఎం రేవంత్‌పై మందకృష్ణ మాదిగ ఫైర్‌.. మాలలకు అనకూలంగా ఉన్నారంటూ ఆగ్రహం

మంద కృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌ మాలలు ఇచ్చిన సూచనలు పక్కాగా అమలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. వర్గీకరణ ప్రక్రియ పూర్తి కాకముందే ఉద్యోగాలన్నీ మాలలకు అప్పగించే పనిలో ఉండిపోయారని మండిపడ్డారు.

New Update
CM Revanth and Manda Krishna madiga

CM Revanth and Manda Krishna madiga

మంద కృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌ మాలలు ఇచ్చిన సూచనలు పక్కాగా అమలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. '' ఎస్సీ వర్గీకరణకు తాము అనుకూలం అంటూనే సీఎం రేవంత్‌ మాలలు ఇచ్చిన సూచనలు అమలు చేస్తున్నరు. వర్గీకరణ ప్రక్రియ పూర్తి కాకముందే ఉద్యోగాలన్నీ మాలలకు అప్పగించే పనిలో ఉండిపోయారు.  

Also Read: 17 ఏళ్లుగా పరారీలో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదిని అరెస్ట్‌ చేసిన యూపీ పోలీసులు!

అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు మాట నిలబెట్టుకోలేకపోతే సీఎం రేవంత్ తన పదవికి రాజీనామా చేయాలి. రేపటి నుంచి జిల్లాల్లోని వర్సిటీల్లో నిరవధిక దీక్షలకు దిగుతాం. ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేయాలని'' మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. అయితే శనివారమే ఆయన సీఎం రేవంత్‌కు బహిరంగ లేఖ రాశారు.  

Also Read: న్యూయార్క్‌ నగరాన్ని కమ్మేస్తున్న కార్చిచ్చు పొగ.. ఆందోళనలో ప్రజలు

ఎస్సీ వర్గీకరణ పూర్తి అయ్యేంత వరకు తెలంగాణలో అన్ని రకాల ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలను నిలిపివేయాలని సూచనలు చేశారు. మార్చి 12 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ కోసం చట్టం చేస్తామని రాష్ట్ర సర్కార్‌ చెప్పినట్లు గుర్తు చేశారు. ఇంతలోనే గ్రూప్స్‌ ఫలితాల తేదీలను ప్రకటించడం సరైంది కాదని అన్నారు. దీనివల్ల ఎస్సీలకు మళ్లీ అన్యాయం జరుగుతుందని ఆరోపణలు చేశారు.     

Also Read: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం..ఎంతకు కొన్నారో తెలుసా?

Also Read: అమెరికాలో హిందూ దేవాలయంపై ఉగ్రదాడి .. పగ పట్టిన ఖలిస్తాన్ మద్ధతుదారులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు