మల్లారెడ్డి గుండాల దాడి.. ఆస్పత్రి బెడ్‌పై ఆర్టీవీ రిపోర్టర్‌

మల్లారెడ్డి హాస్పిటల్‌లో డెడ్‌బాడీకి ట్రీట్‌మెంట్‌ చేశారని రిపోర్టింగ్‌ చేస్తుండగా ఆర్టీవీ రిపోర్టర్లు విజయ్‌, సాగర్‌, కెమెరా మెన్‌లపై మల్లారెడ్డికి చెందిన 15 మంది బౌన్సర్లు మూకుమ్మడిగా దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన రిపోర్టర్ విజయ్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

New Update

కబ్జాల రెడ్డిగా గుర్తింపు పొందిన బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి గూండాలు మరోసారి దౌర్జన్యానికి దిగారు. జర్నలిజంపైనా దాడులకు తెగబడ్డారు. మల్లారెడ్డి హాస్పిటల్‌లో డెడ్‌బాడీకి ట్రీట్‌మెంట్‌ చేశారని శనివారం మృతురాలి బంధువులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. అయితే ఈ ఘటనపై రిపోర్టింగ్‌ చేస్తుండగా ఆర్టీవీ రిపోర్టర్లు విజయ్‌, సాగర్‌, కెమెరా మెన్‌లపై మల్లారెడ్డికి చెందిన 15 మంది బౌన్సర్లు మూకుమ్మడిగా దాడికి దిగారు. ఈ దాడిలో రిపోర్టర్ విజయ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఫోన్లు లాక్కుని, కెమెరాలు ధ్వంసం చేసిన బౌన్సర్లు ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లిపోవాలంటూ పిడిగుద్దులు కురిపిస్తూ.. అతడిని చచ్చేలా కొట్టారు.

Also Read: ధరణి స్కామ్.. రూ. 60వేల కోట్ల ప్రభుత్వ భూములు స్వాహా!

వెంటనే విజయ్‌ను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఆస్పత్రి బెడ్‌పై చికిత్స తీసుకుంటున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి RTV ఫిర్యాదుతో సూరారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన జరిగి 24 గంటలు గడుస్తున్నా చర్యలు మాత్రం శూన్యం. బౌన్సర్ల దాడిపై ఇప్పటివరకూ హాస్పిటల్ యాజమాన్యం స్పందించలేదు. ముగ్గురిపై మాత్రమే పోలీసుల చర్యలు తీసుకున్నారు. మిగతా వారిపై చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యమేంటి? అసలు హాస్పిటల్‌లో బౌన్సర్లను ఉంచుకోవాల్సిన అవసరం ఏంటి..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Also Read: కుల గణన చేసేది అందుకోసమే.. కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్

గతంలో కాలేజీ విషయంలో కూడా.. RTV సిబ్బందిపై మల్లారెడ్డి సిబ్బంది దాడికి యత్నించారు. మల్లారెడ్డిపై అనేక భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి. కబ్జాల రెడ్డిగా తెలుగు రాష్ట్రాల్లో పేరు సంపాదించారు. అయితే ఆయన విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సానుభూతి చూపుతోందంటూ ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. 

Also read: తెలంగాణ వచ్చి పదేళ్లైన వలసలు కొనసాగుతున్నాయి: సీఎం రేవంత్  

Also Read: కులగణనపై పొన్నం కీలక భరోసా.. అవి రహస్యంగానే ఉంచుతామంటూ!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు