కులగణనపై పొన్నం కీలక భరోసా.. అవి రహస్యంగానే ఉంచుతామంటూ!

తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వేపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక భరోసా ఇచ్చారు. సర్వే వల్ల సంక్షేమ పథకాల్లో కోత ఉండదని చెప్పారు. సర్వేలో వెల్లడించిన వివరాలు మొత్తం గోప్యంగా ఉంచుతామన్నారు. ప్రజలంతా సహకరించాలని కోరారు.

author-image
By srinivas
New Update
Ponnam Prabhakar: మీకు కేంద్ర మంత్రులుగా ఉండే అర్హత లేదు.. బీజేపీ ఎంపీలపై పొన్నం ఫైర్!

Caste Census: తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వేపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక భరోసా ఇచ్చారు. సర్వే వల్ల సంక్షేమ పథకాల్లో కోత ఉండదని చెప్పారు. సర్వేలో వెల్లడించిన వివరాలు మొత్తం గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ మేరకు ఆదివారం హుస్నాబాద్ లో సర్వేను పరిశీలించిన పొన్నం... రాష్ట్ర వ్యాప్తంగా 87 వేల మంది ఎన్యుమరేటర్లతో సర్వే కొనసాగుతోందని చెప్పారు.

జనాభా తెలుసుకునేందుకే..

ఈ మేరకు పొన్నం మాట్లాడుతూ.. అన్ని రకాల అసమానతలను తొలగించి, కులాల జనాభా తెలుసుకునేందుకు సర్వే చేస్తున్నాని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 6వ తేదీ నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. దీనిపై ఈనెల 30 వరకు కార్యక్రమం నిర్వహిస్తోంది. ఒక్కో ఎన్యూమరేటర్ 150 నుంచి 175 ఇళ్ల దాకా కేటాయించారు. కుటుంబ వ్యక్తిగత వివరాలను ఎన్యూమరేటర్లు సేకరిస్తున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి కుటుంబంలోని సభ్యులందరి సమగ్ర వివరాలను నమోదు చేస్తున్నారు. కాబట్టి ప్రజలంతా సహకరించాలి. కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారం నమొద్దు’ అని కోరారు. 

ఇది కూడా చదవండి: కుంకుమ పువ్వు సాగు.. కిలో రూ.5 లక్షలు పలుకుతున్న ధర

మొత్తం 243 కులాలు..

ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వే కోసం మొత్తం 243 కులాలను గుర్తించింది. వీటన్నింటికీ కోడ్స్‌ను కూడా కేటాయించింది. అధికారులు తమ ప్రశ్నపత్రంలో ఆయా కుటుంబాల కులానికి సంబంధించిన కోడ్‌ కేటాయించాల్సి ఉంటుంది.  ఎస్సీ కేటగిరిలో 59 కులాలు ఉండగా, ఎస్టీ కేటగిరిలో 32 కులాలు ఉన్నాయి. బీసీ కేటగిరిలో ఏ,బీ,సీ,డీ, ఈబీసీ కలిపి మొత్తం 134 కులాలు ఉన్నాయి. ఇక ఓసీలో 18 కులాలు ఉన్నాయి. అయితే ఓసీ కేటగిరీలో బుద్ధిస్టులను, జైన్లలను కూడా చేర్చారు. అలాగే మతపరమైన కేటిగిరిలో కూడా బుద్ధిస్టు, జైన్లకు వేరువేరు కోడ్‌లను ఇచ్చారు. అలాగే ఎస్సీ కేటగిరీ నుంచి క్రైస్తవులుగా మారిపోయిన వాళ్లని బీసీ 'సీ' లుగా వర్గీకరించారు. నిరాశ్రయుల వారసులు, అనాథలను బీసీ ఏ కేటగిరీ కిందకు చేర్చారు. 

ఇది కూడా చదవండి: మణిపూర్‌లో ముగ్గురు పిల్లల తల్లిపై అత్యాచారం.. అనంతరం సజీవ దహనం

 

Advertisment
Advertisment
తాజా కథనాలు