/rtv/media/media_files/2025/12/01/fotojet-2025-12-01t111205234-2025-12-01-11-14-29.jpg)
Maoist Devji's daughter's sensational letter to CM Revanth
Maoist Devji : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నాయకుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ పోలీసుల అదుపులో ఉన్నాడని గతకొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు పలువురు అగ్రనేతలను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారని ప్రచారం సాగుతోంది. తిప్పిరి తిరుపతిని ఎన్‌కౌంటర్ చేయబోతున్నారని పౌర హక్కుల సంఘం నేతలు సైతం పదే పదే ఆరోపిస్తున్నారు. హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టు అగ్రనేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు తిప్పిరి తిరుపతి తమ్ముడి కూతురు సుమ లేఖ రాసింది. ఆ లేఖను సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసింది.
శ్రీమాన్ గౌరవనీయులు
— Suma Thipiri (@SumaThipir54000) November 30, 2025
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
శ్రీ అనుముల రేవంత్ రెడ్డి @revanth_anumula గారికి,
నా పెదనాన్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ గారు, మావోయిస్టు పార్టీ చీఫ్‌గా ఉన్నారు. ఇటీవల ఆయన పోలీసుల కస్టడీలో ఉన్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలు నిజమా? కాదా? అనేది మా…
లేఖ సారాంశం..
శ్రీమాన్ గౌరవనీయులు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
శ్రీ అనుముల రేవంత్ రెడ్డి
@revanth_anumula
గారికి,
‘‘నా పెదనాన్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, మావోయిస్టు పార్టీ చీఫ్‌గా ఉన్నారు. ఇటీవల ఆయన పోలీసుల కస్టడీలో ఉన్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలు నిజమా? కాదా? అనేది మా కుటుంబానికి స్పష్టంగా తెలియడం లేదు. కానీ ప్రతిరోజూ వినిపించే ఈ సమాచారం మా కుటుంబాన్ని తీవ్ర కలిచివేతకు గురిచేస్తోంది. ఒకవేళ ఈ వార్తలు నిజమే అయితే, దయచేసి ఆయనను కోర్టులో హాజరుపరచేలా చూడాలని లేదా లొంగిపోవడానికి అవకాశం ఇవ్వాలని మా కుటుంబం తరపున మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటుంది. గత 40 ఏళ్లుగా మా కుటుంబం ఆయన కోసం ఎదురు చూడని రోజంటూ లేదండి.. ఆయన కోసం వేచిచూస్తున్న సమయాన్ని మాటల్లో చెప్పలేం. న్యాయం కోసం నిజమైన నాయకులు ముందుండే వారు మీరు అని నమ్మే ఒక పౌరురాలిగా, మీ స్పందన కోసం ఎదురు చూస్తున్నాను సార్..
మేము తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల పట్టణానికి చెంది ఉన్నందున, మా పెదనాన్న పరిస్థితిపై మీరు దయచేసి స్పందించి సహాయం చేయాలి అని వినమ్రంగా కోరుకుంటున్నాను.. మా కుటుంబానికి మీరు తప్పకుండా న్యాయం చేస్తారని మనస్పూర్తిగా విశ్వసిస్తున్నాం.. ఈ ట్వీట్ మీవరకు చేరుతుందని, మీరు సానుకూలంగా స్పందిస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నాం సార్’
ఇట్లు
సుమ తిపిరి
D/O గంగాధర్
అని లేఖలో పేర్కొన్నారు.
Follow Us