వరద బాధితులకు ఎంపీ మల్లు రవి సాయం
ముఖ్యమంత్రి సహాయ నిధికి నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి తన ఒక నెల వేతనాన్ని అందజేశారు. వరద బాధితులను ఆదుకోవాలన్న సీఎం రేవంత్ పిలుపుతో తన నెల జీతం రూ.1.90 లక్షలను సీఎంఆర్ఎఫ్ కు అందిస్తున్నట్లు మల్లు రవి వెల్లడించారు.
ముఖ్యమంత్రి సహాయ నిధికి నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి తన ఒక నెల వేతనాన్ని అందజేశారు. వరద బాధితులను ఆదుకోవాలన్న సీఎం రేవంత్ పిలుపుతో తన నెల జీతం రూ.1.90 లక్షలను సీఎంఆర్ఎఫ్ కు అందిస్తున్నట్లు మల్లు రవి వెల్లడించారు.
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాలని కోరుతూ ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందించారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రిని ఈ రోజు హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు. అర్చకులు సీఎంకు ఆశీర్వాదం అందించారు.
తెలంగాణ లో 11 జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఆ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.
గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల తెలంగాణలోని చాలా ఊర్లకు సంబంధాలు తెగిపోయాయి. పలు జిల్లాల్లోని గ్రామాలకు వెళ్లే రోడ్లు దెబ్బతినడం వల్ల సుమారు 117 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.
నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం ఎక్కమేడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలకు ఇల్లు కూలి తల్లి, కూతురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు హనుమమ్మ(78), అంజిలమ్మ (35)గా గుర్తించారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది.భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. మహబూబాబాద్ సమీపంలోని అమోధ్య గ్రామంలో చెరువు కట్ట తెగింది.దీంతో విజయవాడ – కాజీపేట మార్గంలో ట్రాక్ ను ఆనుకొని వరద నీరు ప్రవహించడంతో ట్రాక్ కింద రాళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి.
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
గద్వాల జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన పాలక వర్గం ఏర్పాటు కాంగ్రెస్ అధిష్టానానికి కత్తిమీద సాములా మారింది. తాము సిఫార్సు చేసిన వారికే పదవి కట్టబెట్టాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ సరిత వర్గాలు పట్టుబడుతున్నాయి.
తెలంగాణ విద్య వ్యవస్థలో మార్పులకు సలహాలు, సూచనలను ఆహ్వానించడం ప్రజాపాలన మార్కుకు నిదర్శనమంటున్నారు తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఫిజిక్స్ అరుణ్ కుమార్. ప్రభుత్వ విద్యా సంస్థలకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించి అందరికీ అంతర్జాతీయ స్థాయి విద్య అందాలని కోరుతున్నారు.