Heavy Rains: రాష్ట్రానికి రెడ్ అలర్ట్...మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు! అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. By Bhavana 01 Sep 2024 in తెలంగాణ ఖమ్మం New Update షేర్ చేయండి Heavy Rains: వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు పడుతున్నాయి. ప్రధానంగా ఖమ్మం, ముదిగొండ, కుసుమంచి, ఎర్రుపాలెం, మధిర, మండలాల్లో భారీ వర్షాలు కురవగా మిగిలిన మండలాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. దుమ్ముగూడెం, చర్ల, భద్రాచలం, బూర్గంపాడు, మండలాల్లో ఏకధాటిగా కురిసిన వర్షాలతో జనజీవనం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. భారీ వర్ష సూచన ఉన్న కారణంగా ప్రజలు అవసరమైతెనే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు. ఎర్రుపాలెం-కృష్ణాపురం వద్ద ప్రధాన రహదారిపైకి వరద పోటెత్తడంతో ఆర్టీసీ బస్సు వాగు ఉద్ధృతితో చిక్కుకుపోయింది. స్థానికులు, పోలీసులు కలిసి ప్రయాణికులను తాడు సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలుకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపధ్యంలో కలెక్టర్లు అధికారులను అప్రమత్తం చేశాడ్రైనేజీలు పొంగడంతో జనావాసాల్లోకి మురికి నీరు చేరింది. మిర్యాలగూడలో బస్టాండ్ సమీపంలో గల విద్యుత్ కార్యాలయం వద్ద మోకాలు లోతు నీరు చేరడంతో వినియోగదారులు నానా తిప్పలు పడ్డారు. సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని ఎర్రకుంట చెరువు నిండటంతో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. పలు కాలనీలు నీట మునిగాయి. Also Read: బంగారం కాస్త తగ్గింది.. భారీగా దిగొచ్చిన వెండి ధరలు! #telangana #another-two-days #rains మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి