TG: సరిత VS ఎమ్మెల్యే.. సీటు కోసం ఫైట్..!

గద్వాల జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన పాలక వర్గం ఏర్పాటు కాంగ్రెస్ అధిష్టానానికి కత్తిమీద సాములా మారింది. తాము సిఫార్సు చేసిన వారికే పదవి కట్టబెట్టాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా ఇన్‌ఛార్జ్‌ సరిత వర్గాలు పట్టుబడుతున్నాయి.

New Update
TG: సరిత VS ఎమ్మెల్యే.. సీటు కోసం ఫైట్..!

Also Read: టీటీడీ కీలక నిర్ణయం.. శ్రీవారి లడ్డూపై ఆంక్షలు..!


నెలల క్రితమే తమ వర్గం పేర్లను ప్రతిపాదించారు జిల్లా ఇన్‌ఛార్జ్‌ సరిత. తాజాగా ఎమ్మెల్యే బండ్ల పంపిన పేర్లను సిఫార్సు చేశారు మంత్రి జూపల్లి. జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి దామోదర రాజనర్సింహకు సరిత లేఖ రాశారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్‌తోపాటు సభ్యుల పేర్లను దామోదర్ రాజనర్సింహకు పంపారు. మరోవైపు తన వర్గం పేర్లను మంత్రి జూపల్లి ద్వారా మంత్రి తుమ్మలకు పంపారు కృష్ణమోహన్ రెడ్డి. అయితే, మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి ఏ వర్గానికి దక్కుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

Advertisment
తాజా కథనాలు