/rtv/media/media_files/2025/02/26/minister-ponnam-prabhakarr-999440.jpeg)
మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ దక్షిణకాశీగా పేరొందిన ప్రసిద్ద శైవ క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు.
/rtv/media/media_files/2025/02/26/minister-ponnam-285917.jpeg)
ఈ వేడుకల్లో పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమ ర్పించారు.
/rtv/media/media_files/2025/02/26/minister-ponnam-prabhakar-946076.jpeg)
అలాగే మహాశివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకుని భక్తులు కూడా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తారు.
/rtv/media/media_files/2025/02/26/brs-rathod-175558.jpeg)
మహాశివరాత్రి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా, కురవి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారిని మాజీ మంత్రి, శాసనమండలి బి.ఆర్.ఎస్ పార్టీ విప్ సత్యవతి రాథోడ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
/rtv/media/media_files/2025/02/26/McI8wzmUNKOsTe2qFRS6.jpeg)
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మధిర పట్టణంలోని శివాలయంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీసమేతంగా పూజలు నిర్వహించి స్వామి వారికి అభిషేకం చేయించారు.
/rtv/media/media_files/2025/02/26/malla-reddy-sivaratri-742390.jpeg)
మహాశివరాత్రి సందర్భంగా కీసరలో శ్రీ రామలింగేశ్వర స్వామిని జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే మల్లారెడ్డి దర్శించుకున్నారు.
/rtv/media/media_files/2025/02/26/kavitha-855108.jpeg)
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు.
/rtv/media/media_files/2025/02/26/mahasivaratri-879998.jpeg)
మహాశివరాత్రి సందర్భంగా నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు దేవస్థానం శ్రీ పార్వతి సమేత జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.