/rtv/media/media_files/2025/09/25/liquor-shop-applications-open-in-telangana-2025-09-25-16-39-58.jpg)
Liquor Shop Applications Open in Telangana
తెలంగాణ ప్రభుత్వం వైన్ షాపుల కేటాయింపునకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2620 మద్యం దుకాణాలకు సెప్టెంబర్ 26 (శుక్రవారం) నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. అక్టోబర్ 18 వరకు అప్లికేషన్లు తీసుకోనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు దీనికి సంబంధించి గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. ఇక అక్టోబర్ 23న లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలు కేటాయించనున్నారు. రెండేళ్ల కాలానికి ఎక్సైజ్ శాఖ దుకాణదారులకు కొత్త లైసెన్సులు జారీ చేయనుంది. అంటే 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు ఈ గడువు ఉండనుంది.
Also Read: తల్లిదండ్రులు పిల్లల్ని గెంటేయొచ్చు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఇదిలాఉండగా కొత్త మద్యం దుకాణాలకు ఈసారి దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలుగా ఉంది. ఎక్సైజ్ చట్టం 1968 ప్రకారం శిక్ష పడ్డ వాళ్లకి అలాగే ప్రభుత్వానికి బకాయిలు పడి సక్రమంగా చెల్లించని వాళ్లకు మద్యం దుకాణాలు పొందే అర్హత ఉండదు. మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్ కూడా ఉంటుంది. ఇందులో చూసుకుంటే గౌడ సమాజిక వర్గానికి 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. అయితే రిజర్వేషన్ దరఖాస్తుదారులు అప్లై చేసుకునేటప్పుడు వారు కుల ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా జతచేయాల్సి ఉంటుంది.
Also Read: సొంత పౌరులపై పాక్ బాంబులు.. మరో 13 మందిని చంపి.. ఏం చేసిందంటే?