Telangana: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మద్యం ధరలు భారీగా పెంపు..?

మందుబాబులకు త్వరలోనే షాక్ తగిలే ఛాన్స్ కనిపిస్తుంది. మద్యం ధరలను పెంచేందుకు సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి బీర్ల ఉత్పత్రి కేంద్రాలకు చెల్లించే ధరలను పెంచుతుంది.

New Beers in Telangana: తెలంగాణలోకి కొత్త బీర్లు ఎంట్రీ! పేర్లు అదిరిపోయాయిగా..
New Update

Liquor Prices: తెలంగాణలోని మందుబాబులకు గట్టి షాక్‌ ఇచ్చేందుకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం రెడీ అయ్యింది. త్వరలోనే మద్యం ధరలకు భారీగా పెంచేందుకు రంగం సిద్దమైనట్లు సమాచారం అందుతోంది. అందులో ముఖ్యంగా బీర్ల ధరలను మరింతగా పెంచనున్నట్టు సమాచారం. రాష్ట్రానికి బీర్లు సరఫరా చేసే.. ఉత్పత్తి కేంద్రాలకు చెల్లించే ధరలను ప్రభుత్వం రెండు సంవత్సరాలకి  ఒకసారి పెంచుతూ ఉంటుంది. 

Also Read:  జనవరి నుంచి కొత్త పింఛన్లు..నవంబర్‌లో దరఖాస్తుల స్వీకరణ

ఇందులో భాగంగానే.. ఈసారి వివిధ రకాల బ్రాండ్ల మీద.. 20 రూపాయల నుంచి 150 వరకు పెంచాలని బ్రూవరీలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరినట్టు సమాచారం. ఈ మేరకు త్వరలోనే.. బీర్ల ధరల పెంపుపై రేవంత్ రెడ్డి సర్కార్ (Revanth Reddy Govt) ఏదోక నిర్ణయం తీసుకోనుంది. 

సుమారు 15 శాతం వరకు పెరిగే..

అయితే.. ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయంతో మద్యం ధరలు సుమారు 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ మద్యం ధరలను 15 శాతం పెంచితే.. ఎక్సైజ్ శాఖకు ప్రస్తుతం వచ్చే ఆదాయం కంటే.. అదనంగా మరో 5 వేల కోట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మద్యం అమ్మకాల ద్వారా వస్తున్న ఆదాయాన్ని మరో రూ.5318 కోట్లు పెంచాలని ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే.. ధరల పెంపు ప్రక్రియ సాగుతోందనే టాక్‌ కూడా నడుస్తుంది.

Also Read: మారుతున్న వాతావరణానికి ఈ గింజలు ఎంతో మేలు !

ఇదిలా ఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 2260 మద్యం దుకాణాలు ఉండగా.. 1171 బార్లు ఉన్నాయి. వీటన్నింటికీ.. రాష్ట్రంలో ఉన్న 6 బ్రూవరీల నుంచి బీర్లు సరఫరా అవుతుంటాయి. వీటన్నింటికీ సరఫరా చేసేందుకు.. ఈ 6 బ్రూవరీల నుంచి ఏటా 88 కోట్ల లీటర్ల బీరు ఉత్పత్తి అవుతోంది. అయితే.. ప్రతి సంవత్సరం దసరా పండుగ సమయంలో మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతాయి. ఈసారి 10 రోజుల వ్యవధిలో రూ.1,100 కోట్లకు పైగా మద్యాన్ని మందుబాబులు పీపాల్లాగా తాగేశారు. అందులో ముఖ్యంగా.. 17.59 లక్షల బీర్ల కేసులు అమ్మినట్లు సమాచారం.

Also Read:  బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..మరో నాలుగు రోజులు వర్షాలు!

ఒకవేళ మద్యం ధరలు పెరిగితే.. మద్యంప్రియుల జేబులకు గట్టిగానే చిల్లులు పడేట్లు కనపడుతున్నాయి. ఇప్పటికే మద్యం ధరలను ప్రతిసారి పెంచుతూపోతున్న విషయం తెలిసిందే. మద్యం అమ్మకాలతో ప్రభుత్వం ఖాజానాకు భారీ ఆదాయం వస్తుందన్న కారణంతో.. ప్రభుత్వాలు మద్యం ధరలకు ప్రతిసారి గట్టిగానే పెంచుతున్నారు.

Also Read: హనుమంతుడి గుడి కూల్చివేతలో ట్విస్ట్‌...ఎవరు చేశారో తెలుసా!

#telangana-news #congress #cm-revanth-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe