New Pensions: జనవరి నుంచి కొత్త పింఛన్లు..నవంబర్‌లో దరఖాస్తుల స్వీకరణ

కొత్త ఏడాది జనవరిలో ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద కొత్త పింఛన్లు మంజూరు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయిం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనవరిలో కొత్త లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు.

New Update
Pensions Cut: పెన్షన్ దారులకు బిగ్ షాక్.. వారందరికీ పెన్షన్లు కట్!

New Pentions: రాష్ట్రంలో కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు కూటమి సర్కారు కసరత్తు ప్రారంభించింది. కొత్త ఏడాది జనవరిలో ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద కొత్త పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయిం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read:  హనుమంతుడి గుడి కూల్చివేతలో ట్విస్ట్‌...ఎవరూ చేశారో తెలుసా!

జన్మభూమి  కార్యక్రమాన్ని జనవరిలో ప్రారంభించే అవకాశాలున్న నేపథ్యంలో ఆ సభల్లో కొత్త లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించేలా అధికారులు మార్గాన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ హయాంలో అనర్హులకు ఇబ్బడిముబ్బడిగా పింఛన్లు మంజూరు చేశారనే ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. 

Also Read: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..మరో నాలుగు రోజులు వర్షాలు!

ప్రధానంగా కొన్ని వేల మంది అనర్హులు దివ్యాంగుల కేటగిరీలో తప్పుడు సదరం ధ్రువీకరణపత్రాలతో పింఛన్లు పొందుతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. వైఎస్సార్‌, అనంతపురం జిల్లాలతో పాటు మరికొన్ని చోట్ల ఇది బట్టబయలైంది. చేనేత పింఛన్లలోనూ అనర్హులు ఉన్నట్లు తేలింది. దీంతో అన్ని రకాల పింఛన్లను తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి.

Also Read: యహ్యా సిన్వార్ మృతి..ధృవీకరించిన ఇజ్రాయెల్

త్వరలో మంత్రులతో కమిటీ..


పింఛన్ల తనిఖీ, కొత్త పింఛన్ల మంజూరుకు విధివిధానాల రూపకల్పన కోసం 8 మంది మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, అచ్చెన్నాయుడు, నారాయణ, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్‌ యాదవ్, డోలా బాల వీరాంజనేయస్వామి, గుమ్మడి సంధ్యారాణి, సవితలతో ఉపసంఘం ఏర్పాటుకు రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. మంత్రివర్గ ఉపసంఘం నివేదికను కమిటీ ఏర్పాటైన 10-15 రోజుల్లోగా ప్రభుత్వానికి అందించనున్నట్టు సమాచారం.

Also Read: మళ్ళీ బాంబు బెదిరింపు..ఈసారి ముంబయ్‌‌–లండన్ ఎయిర్ ఇండియా విమానానికి

 కొత్త పింఛన్ల ఎంపికకు నవంబర్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అదే నెలలో పింఛన్ల తనిఖీ చేపడతారు. 45 రోజుల్లో అనర్హులకు నోటీసులిచ్చి, పింఛన్లు తొలగిస్తామని అధికారులు తెలిపారు. అర్హులెవరికీ అన్యాయం జరగకుండా అర్హులు, అనర్హుల జాబితాలను గ్రామసభల్లో ప్రజల ముందు పెడతారు. అక్కడ ఏవైనా ఫిర్యాదులు వస్తే సరిచేస్తారు. మొత్తంగా డిసెంబర్‌ నెలాఖరు నాటికి కొత్త పింఛన్ల లబ్ధిదారుల ఎంపిక, ప్రస్తుత పింఛన్లలో అనర్హుల ఏరివేత పూర్తి చేయనున్నట్టు తెలిసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు