Tiger Attack: కుమురంభీం జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. పత్తిచేనులో పని చేస్తుండగా పులి పంజాకు ఓ యువతి బలైయింది. స్థానికుల వివరాల ప్రకారం.. కాగజ్‌నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మి (21) నజ్రుల్‌నగర్ గ్రామ శివారులోని చేనులోకి పత్తి ఏరేందుకు శనివారం ఉదయం మరో ఆరుగురు మహిళలతో కలిసి వెళ్లారు. చేనులో పని చేస్తుండగా.. కొంతసేపటికే పెద్దపులి వచ్చి లక్ష్మిపై దాడిచేసి నోటకరచుకుని వెళ్లింది. ఈ సమయంలో పనిచేస్తున్న వారు గట్టిగా అరవడంతో కొంతదూరంలో లక్ష్మిని వదిలి పులి వెళ్లిపోయింది.
అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ..
పులి దాడిలో లక్ష్మి మెడపై తీవ్రగాయాలయ్యాయి. రక్తస్రావమవుతూ కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ యువతిని స్థానికులు బైక్‌పై కాగజ్‌నగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే లక్ష్మి ప్రాణాలు విడిచింది. రెండు కిత్రం పుల కదలికలగురించి సమాచారమిచ్చాని అటవీ సిబ్బంది పట్టించకోలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కాగజ్‌నగర్ అటవీశాఖ డివిజన్ కార్యాలయం ఎదుట మృతదేహంతో కుటుంబసభ్యులు ధర్నా చేశారు. పులి కదలికల గురించి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి అధికారులను సస్పెండ్ చేయాలని గ్రామస్థులు, బంధువులు డిమాండ్ చేశారు.
Also Read: వెల్లుల్లి తింటే పురుషులకు అద్భుత ప్రయోజనాలు
ప్రమాదంపై సమాచారం అందుకున్న ఎస్పీ శ్రీనివాసరావు, సీఎఫ్ శాంతారాం అక్కడికి చేరుకుని మృతురాలి కుటుంబసభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం, ఐదు ఎకరాల భూమి, కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వటంతో ఆందోళనను విరమించారు. గన్నారం గ్రామానికి చెందిన వసంత్‌రావు-విమల దంపతుల కుమార్తె లక్ష్మి. ఏడాది క్రితం అదే గ్రామానికి చెందిన వాసుదేవ్‌తో వివాహమైంది. ఈ ఘటనకు ముందు ఇదే ప్రాంతంలో ఆవుపై పులి దాడి చేసింది. కొంతసేపటికే లక్ష్మిపై దాడికి పాల్పడిందని గ్రామస్థులు తెలిపారు.
Also Read: బెండకాయతో ఈ ఐదు కూరగాయలు తింటే ఆరోగ్యానికి హానికరం
Also Read: రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు
Also Read: తిరుమంగై ఆళ్వార్ విగ్రహం ఇండియాకు వచ్చేస్తోంది...