HYDRA: హైడ్రాకు షాక్.. కూల్చివేతలపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు!

హైడ్రాకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. కూల్చివేతలపై కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయబద్దమైన నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టొద్దని స్పష్టం చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు తీర్పును పాలించాల్సిందేనని తేల్చి చెప్పింది.

New Update
HYDRA SUPREME

Hydra:  ప్రభుత్వాలకు అత్యున్నత ధర్మాసనం వార్నింగ్ ఇచ్చింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై బుల్డోజర్‌లను ప్రయోగించడాన్ని సుప్రీం కోర్టు  తప్పుపట్టింది. న్యాయబద్దమైన నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టొద్దని స్పష్టం చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు తీర్పును పాలించాల్సిందే అని తేల్చి చెప్పింది. నిందితులను దోషులు నిర్ధారించొద్దని పేర్కొంది. విచారణ పూర్తికాకుండానే నిందితులను దోషిగా పరిగణించలేం అని అభిప్రాయపడింది. దోషిగా నిర్ధారించిన చట్ట ప్రకారమే శిక్ష ఉండాలని తెలిపింది. నిందితుల ఇళ్లను బుల్డోజర్‌తో కూల్చడం చట్ట విరుద్ధం అని చెప్పింది.

 ఇళ్లను కూల్చడం అంటే నివసించే హక్కును కాలరాయడమే అని స్పష్టం చేసింది. అయితే తెలంగాణలో ఇటీవల హైడ్రా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. చెరువులు, నాలాలు ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. హైడ్రా కార్యాచరణ అనేక విమర్శలకు దారి తీసింది. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేశారని బాధితులు నుంచి ఆరోపణలు వచ్చాయి. అయితే తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో కట్టడాలను కూల్చాలని అనుకుంటే నోటీసులు ఇవ్వడం తప్పనిసరి అయింది.

రంగనాథ్ కీలక వ్యాఖ్యలు...

హైడ్రా కమిషనర్ రంగనాథ్ బెంగళూరు పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. కాగా ఈరోజు  బతుకమ్మ కుంట ప్రాంతంలో పరిశీలనకు వచ్చారు. అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు రంగనాథ్. బతుకమ్మ కుంట చెరువుకు పూర్వ వైభవం తీసుకొస్తాం అని అన్నారు. బతుకమ్మ కుంట ప్రాంతంలో ఎలాంటి ఇళ్ల కూల్చివేతలు ఉండవని స్పష్టం చేశారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అన్ని శాఖల అధికారులతో ఇప్పటికే చర్చించామని చెప్పారు. అన్ని పార్టీల నేతలు కూడా బతుకమ్మ కుంట పునరుద్ధరణ కోసం తనను కలిసినట్లు చెప్పారు. త్వరలోనే హైడ్రా ఆధ్వర్యంలో పునరుద్ధరణ చర్యలు ప్రారంభమవుతాయని అన్నారు . 

Advertisment
Advertisment
తాజా కథనాలు