పట్నం ఫోన్లో లగచర్ల దాడి కుట్ర రహస్యాలు..!

లగచర్ల దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ కాల్ డీటెల్స్ కీలకంగా మారాయి. దాడి కేసులో ప్రధాన నింధితుడు సురేశ్ ఫోన్ పగల గొట్టాడు. ఫోన్లో ఉన్న కాల్ డేటా రికవరీ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరికొన్ని రోజుల పోలీసుల కస్టడీ కోసం కోర్డును కోరారు.

New Update
patnam

వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామస్తులు కలెక్టర్ పై దాడి తెలంగాణ రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. అయితే ఈ దాడికి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డితోపాటు అతని అనుచరుడు బోగమోని సురేశ్ ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాడి జరిగిన రోజు సురేశ్, పట్నం నరేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది.

నవంబర్ 11న లగచర్ల దాడి ఘటన జరిగిన రోజే సురేశ్ తన ఫోన్‌‌ను ముక్కలు ముక్కలుగా చేశాడు. సెల్‌‌ఫోన్‌‌ పార్ట్స్‌‌ పోలీసులకు దొరక్కుండా ఎక్కడో దాచేశాడు. పోలీసులకు చిక్కకుండా బీఆర్‌‌‌‌ఎస్‌‌కు చెందిన ఓ లాయర్​ఇంట్లో షెల్టర్ తీసుకున్నాడని తెలిసింది. ఇలా 8 రోజులు పోలీసులను తిప్పలు పెట్టాడు. పోలీసులకు తన జాడ తెలిసిందనే అనుమానంతో నవంబర్ 19న కొడంగల్ కోర్టులో లొంగిపోయాడు.

ఇది కూడా చదవండి : తెలంగాణలో సెమిస్టర్ విధానంలో టెన్త్ క్లాస్ పరీక్షలు..!

కోర్టు అనుమతి తో కస్టడీకి తీసుకుని మంగళవారం, బుధవారం విచారించారు. కానీ ముక్కలు చేసిన ఫోన్‌‌ జాడ చెప్పలేదని తెలిసింది. దీంతో మరో 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు డిసెంబర్ 6న (ఈరోజు) కోర్టును అభ్యర్థించారు. పట్నం నరేందర్ ను కూడా ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. కలెక్టర్ పై దాడి సంబంధించి విచారిస్తు్న్నారు. 

ఫోరెన్సిక్ ల్యాబ్‎కు నరేందర్ రెడ్డి ఫోన్

దర్యాప్తులో భాగంగా నరేందర్‌‌‌‌రెడ్డి ఫోన్‌‌లో ఉన్న సీక్రెట్స్‌‌ను వెలికితీసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. అరెస్ట్‌‌ చేసిన రోజే ఆయన ఐ ఫోన్‌‌ను స్వాధీనం చేసుకున్నారు. కాల్‌‌డేటా ఆధారంగా వివరాలు సేకరించారు. ఘటనకు ముందు కేటీఆర్ సహా పలువురు ముఖ్యనేతలతో మాట్లాడినట్టు గుర్తించారు. సర్వీస్ ప్రొవైడర్ నుంచి కాల్‌‌ డిటెయిల్స్‌‌ రికార్డ్‌‌ (సీడీఆర్‌‌‌‌) సేకరించారు.

ఇది కూడా చదవండి : AEE: నిఖేశ్‌కుమార్‌ ఫ్రెండ్ లాకర్‌లో కిలోన్నర బంగారం, వజ్రాభరణాలు!

ఇంటర్నెట్‌‌ ప్రోటోకాల్‌‌ డిటెయిల్స్ రికార్డ్‌‌(ఐపీడీఆర్‌‌‌‌) ద్వారా సెల్‌‌ఫోన్‌‌తో జరిపిన పూర్తి ఆన్‌‌లైన్‌‌ యాక్టివిటీస్‌‌ గుర్తించేందుకు ఫోరెన్సిక్‌‌ ల్యాబ్‌‌కు పంపించనున్నారు. అయితే, నరేందర్‌‌‌‌రెడ్డి తన ఫోన్‌‌ పాస్‌‌వర్డ్‌‌ను చెప్పకపోవడంతో పోలీసులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఫోరెన్సిక్‌‌ ల్యాబ్‌‌ ద్వారా ఫోన్ ఓపెన్ చేసేందుకు యత్నిస్తే అందులో ఉన్న డేటా మొత్తం డిలీట్‌‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని పోలీస్ అధికారి తెలిపారు. నరేందర్‌‌‌‌ రెడ్డిని కస్టడీకి తీసుకుని విచారించడంతో పాటు ఫోన్‌‌ పాస్‌‌వర్డ్‌‌ తెలుసుకుంటామని చెప్పారు.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు