Aghori: అఘోరిగా తిరుగుతున్న శ్రీనివాస్ గురించి మొదటి భార్య సంచలన నిజాలు బయటపెట్టింది. వాడొక చీటర్ అని, తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని చెప్పింది. వర్షిణిని కూతురుగా చెప్పుకుని తిరిగి ఇప్పుడు భార్య అంటున్నాడంటూ మండిపడింది. తన తాళికూడా బలవంతంగా తీసుకెళ్లినట్లు చెప్పింది.
వర్షిణి జీవితం నాశనం చేస్తాడు..
మొదట తనతో ప్రేమగా ఉన్నట్లు నటించి పెళ్లి చేసుకున్నాడని చెప్పింది. తాను గోమాత ఆశ్రమం పెట్టుకోవాలని అనుకున్నామని, అఘోరి కూడా దానికి సపోర్టు చేయడంతో నమ్మినట్లు చెప్పింది. తనలాగా వర్షిణి జీవితం నాశనం కాకూడదని, అతని నుంచి బయటపడాలని కోరింది. తనకు అంగం లేదని, మహిళను అంటూ జనాలను పిచ్చొళ్లను చేసి లొంగదీసుకుంటాడని చెప్పింది. నిజంగా పురుషాంగం ఉన్నవాళ్లు కూడా అంత ప్రేమ చూపించరని చెప్పింది. తన దగ్గర చాలా ఆధారాలున్నాయని, అన్ని బయటపెడతానని తెలిపింది. తన తాళి కూడా గత నెలలో బలవంతంగా లాకెళ్లిపోయడని, అఘోరి మెడలో ఉన్న వెండి తాడు తనదేనని ఆమె బయటపెట్టింది. దీంతో అఘోరి అంశం మరోసారి చర్చనీయాంశమైంది.
Also Read : కల్యాణ్‌రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ట్రైలర్ చూశారా? కెవ్ కేక
అఘోరీ-శ్రీవర్షిణీ మ్యారేజ్..
ఇదిలా ఉంటే.. అందరూ ఊహించినట్లుగానే లేడీ అఘోరీ-శ్రీవర్షిణీ మ్యారేజ్ చేసుకున్నారు. అదీ ఒకసారి కాదు ఏకంగా రెండు సార్లు వివాహం చేసుకున్నారు. మొదటి సారి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్‌లో బ్రహ్మముహుర్తాన తెల్లవారిజామున 4 గంటలకు వర్షిణీ మెడలో అఘోరీ తాళి కట్టింది. రెండోసారి వర్షిణీ ఇంట్లో ఫ్యామిలీ సమక్షంలోనే బంగారం చైన్‌ను మెడలో వేసి మ్యారేజ్ చేసుకుంది. ఇది గడిచి చాలా రోజులే అయింది. కానీ ఇప్పుడే ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Also Read : 'సూర్య 45'లో మలయాళ బ్యూటీ అనఘా రవి
Aghori for Varshini | telugu-news | today telugu news