Surya 45: 'సూర్య 45'లో మలయాళ బ్యూటీ అనఘా రవి

'సూర్య 45' సినిమాతో మలయాళ నటి అనఘా రవి కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై మంచి హైప్ నెలకొంది. ప్రస్తుతం సూర్య రెట్రో చిత్రం మే 1న విడుదల కానుంది.

New Update
Surya 45

Surya 45

Surya 45: తమిళ స్టార్ హీరో సూర్య నటించిన తాజా రెట్రో(Retro) షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించగా, సినిమాను మే 1వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇక సూర్య ప్రస్తుతం సూర్య 45 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి త్రిష కథానాయికగా ఎంపిక కాగా, ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాష్ రాజ్,  ఎస్.ఆర్. ప్రభు నిర్మాణం వహిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు సాయి అభయంకర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సాత్విక, యోగి బాబు, నట్టి వంటి నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పుడీ చిత్రానికి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఒకటి వైరల్ గా మారింది. మలయాళ భామ అనఘా రవి ఈ సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇటీవల ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ, సూర్య 45 సినిమాలో నటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రంలో తాను కీలక పాత్ర పోషిస్తున్నానని వెల్లడించారు.
అనఘా రవి, మమ్ముట్టి–జ్యోతికలతో కలిసి నటించిన మలయాళ చిత్రం ‘కాతల్’లో వారి కూతురిగా కనిపించి మంచి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా ఆమె నటించిన మరో మలయాళ సినిమా అలప్పుజ జింఖానా తాజాగా విడుదలైంది. అయితే ఇప్పుడు ఆమె కోలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
సూర్య, త్రిష, అనఘా రవి లాంటి నటులతో రూపొందుతున్న ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. మరోసారి సూర్య అభిమానులకు మసాలా, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా మేళవింపుతో కూడిన సినిమా రాబోతోందని  ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు