KTR : ఎర్రవల్లి ఫాంహౌస్‌కు కేటీఆర్.. కేసీఆర్‌‌తో భేటీ..సంచలన నిర్ణయం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మెుదటిసారిగా మాజీ ముఖ్యమంత్రి. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను కలిశారు. ఈ రోజు ఎర్రవల్లి ఫాంహౌస్‌ కు వెళ్లిన కేటీఆర్ పార్టీ అధినేతతో భేటీ అయ్యారు. ఓటమిపై సుదీర్ఘంగా చర్చించారు.

New Update
KCR and KTR

KCR and KTR

Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మెుదటిసారిగా మాజీ ముఖ్యమంత్రి. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను కలిశారు. ఈ రోజు ఎర్రవల్లి ఫాంహౌస్‌ కు వెళ్లిన కేటీఆర్ పార్టీ అధినేతతో భేటీ అయ్యారు. కాగా ఈ సందర్భంగా  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి..ఆ తర్వాత పరిణామాలపై కేసీఆర్ ఆరా తీశారు. ఓటమికి గల కారణాలపై కేసీఆర్ తో చర్చించినట్లు సమాచారం. అదే సమయంలో భవిష్యత్ కార్యచరణపైనా కూడా సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తాజాగా కేటీఆర్, హరీష్ రావులపై చేసిన కామెంట్స్ విషయంపై కూడా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో సీరియస్‌గానే చర్చించినట్లు తెలిసింది. కవిత చేసిన విమర్శలపై ఇంతవరకూ కేటీఆర్, హరీష్ రావు బహిరంగంగా మాత్రం స్పందించలేదు. కేసీఆర్ తో భేటీ అనంతరం ఈ విషయమై  కేటీఆర్ స్పందిస్తారా అనేది తేలాల్సి ఉంది.

ఇలా ఉండగానే జూబ్లీహిల్స్‌లో ఓటమిపై  వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్ వేదికగా కార్యకర్తల సమావేశం జరగనుంది. ఉప ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో జూబ్లీహిల్స్ క్యాడర్‌తో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్‌ లో గెలుపే లక్ష్యంగా పనిచేసినప్పటికీ పరాజయం కావడంతో జూబ్లీహిల్స్ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. కార్యకర్తలు పూర్తిగా నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో వారితో సమావేశం నిర్వహించి వారిలో మనోధైర్యం నింపాలని కేటీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. గ్రామస్థాయి నుంచి కార్యకర్తలను ఉత్తేజపరచడం, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఈ పర్యటన చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై మరింతగా పోరాటం చేయాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించుకుంది.

Advertisment
తాజా కథనాలు