/rtv/media/media_files/2025/05/24/VTZ8m0GgQlsPRn4ehLJ2.jpg)
KTR strong warning to Kavitha
KTR vs Kavitha: కవితకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆమె పేరెత్తకుండానే పార్టీలో ఎవరైనా లేఖలు రాయొచ్చు, సూచనలు చేయొచ్చని చెప్పారు. అయితే కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిదని సూచించారు. బీఆర్ఎస్‌లో ప్రజస్వామిక స్ఫూర్తి ఉందన్నారు.
మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది..
'పార్టీ అధినేతకు లేఖ రాయడం తప్పేమీ కాదు. మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది. పార్టీ అధినేతకు సూచనలు చేయాలంటే లేఖలు రాయొచ్చు. కానీ అంతర్గత విషయాలు.. అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది. అన్ని పార్టీల్లో కోవర్టులు ఉంటారు. సమయం వచ్చినప్పుడు కోవర్టులు వారంతట వారే బయటపడతారు' అని కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు.
Also Read: మావోయిస్టుల అణచివేత.. ఏడుగురు CRPF కమాండోలకు శౌర్య చక్ర ప్రదానం
ఇక తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న లేఖ గురించి కవిత క్లారిటీ ఇచ్చారు. పార్టీలో కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని కవిత అన్నారు. కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు చేరాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్‌కు లేఖ తానే రాసినట్లు ఆమె ఒప్పుకున్నారు. మా నాయకుడు కేసీఆరే అని కవిత క్లారిటీ ఇచ్చారు. అంతర్గతంగా ఆమె రాసిన లేఖ బయటకు ఎలా లీక్ అయ్యిందని కవిత అన్నారు. కేసీఆర్‌ను తప్పుుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. పార్టీలో అంతర్గతంగా ఆమె తండ్రికి రాసిన లేఖ ఎలా కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చేరిందని అనుమానం వ్యక్తం చేశారు. రెండు వారాల క్రితం లేఖ రాశానని కల్వకుంట్ల కవిత ఒప్పుకున్నారు. ఆమె కొడుకు కాన్వకేషన్ ప్రొగ్రామ్‌కు వెళ్లి వచ్చే సరికి లెటర్ ఎలా లీక్ అయ్యిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Also Read: చివరి మ్యాచ్ లోనూ అదరగొట్టిన ఎస్ఆర్హెచ్..ఆర్సీబీపై విజయం