ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీపీ దయాకర్ రెడ్డి, అలాగే బీఎస్పీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నర్మద, తదితర నేతలు శనివారం కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కొడంగల్ నియోజకవర్గాన్ని తక్కువ వ్యయంతో సస్యశ్యామలం చేసే ప్లాన్‌ను పక్కకు పెట్టారని విమర్శించారు.
Also Read: వాళ్లకి గుడ్‌న్యూస్.. కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు..
విహారయాత్రల్లో ఎంజాయ్ చేస్తున్నారు
కమీషన్ల కోసం మాత్రమే కొండగల్ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును చేపట్టారని ఆరోపణలు చేశారు. అలాగే ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు పలు వర్గాల ఆందోళనలు, ధర్నాలు చేపట్టాయని.. ఓవైపు తెలంగాణ అట్టుడుకుతుంటే మరోవైపు మంత్రులు విహారయాత్రల్లో ఎంజాయ్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చీకటిని చూసినప్పుడే వెలుగు విలువ తెలుస్తుందన్నారు. గత పదేళ్లపాటు ప్రగతిపథంలో పరుగులు పెట్టిన తెలంగాణ ఆదాయం ఇప్పుడు తగ్గుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల ఆదాయం మాత్రం పెరుగుతోందంటూ సెటైర్లు వేశారు.
కాంగ్రెస్‌ను ఓడించాలి
తెలంగాణ ప్రభుత్వ హెలికాప్టర్‌ను రాష్ట్ర ప్రభుత్వం.. ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి వాడుకుంటోందని విమర్శించారు. ఇది అధికార దుర్వినియోగం అంటూ మండిపడ్డారు. స్థానిక సంస్థలు ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్‌ను కొడంగల్‌లో ఓడించాలని బీఆర్‌ఎస్ పార్టీ నేతలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
Also Read: కాళేశ్వరం వ్యవహారంపై విచారణ.. హరీశ్ రావు పేరు మూడుసార్లు ప్రస్తావన