KTR: 2028లో కాంగ్రెస్‌ను బొంద పెట్టడం ఖాయం.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2028లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమన్నారు. నారాయణపేట జిల్లాలోని కోస్గి సభలో ఆయన మాట్లాడుతూ రేవంత్‌ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

New Update
KTR

KTR

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2028లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమన్నారు. నారాయణపేట జిల్లాలోని కోస్గి సభలో ఆయన మాట్లాడుతూ రేవంత్‌ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. నీటి ద్రోహంపై సమాధానం చెప్పలేకే ఇలాంటి నికృష్టపు మాటలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. '' జల హక్కులను కాపాడటం చేతగాని దద్దమ్మా.. పెద్ద నోరేసుకోని అహంకారంతో అరుస్తున్నవా?. పాలమూరు ప్రాజెక్టు గొంతుకోసి సొంత జిల్లానే దగా చేస్తుంది చాలక దగుల్బాజీ కూతలు కూస్తున్నవా?. తెలంగాణ సోయిలేని..రాష్ట్ర ప్రయోజనాలను రక్షించలేని కోవర్ట్ బతుకు నీది. 

Also Read: అరుణాచల్‌ప్రదేశ్‌పై రాజీపడని చైనా.. పెంటగాన్ రిపోర్టులో కీలక విషయాలు

అడ్డంగా దొరికిపోవడం, ఆగమాగం కావడం, అడ్డదిడ్డంగా వాగడం నీకు అలవాటే కదా. నీటి హక్కులపై రాజీపడ్డ నీ నిర్వాకాన్ని బయటపెడితే తట్టుకోలేక చిల్లర డైలాగ్లతో చిందులు తొక్కుతున్నావు. విధ్వంసక పాలనతో ప్రజలను చావ గొడుతున్నవు. వికృత మనస్తత్వంతో చావులు కోరుతున్నవు. సభ్యత, సంస్కారంలేని నీచమైన నీ వాగుడును చూసి జనం చీదరించుకుంటున్నా , ఛీకొడుతున్నా ఇంకా మారవా ?.

Also Read: పీల్చే గాలిలో కూడా ‘మైక్రోప్లాస్టిక్స్‌’.. వెలుగులోకి సంచలన నిజాలు

పట్ట పగలు నోట్ల కట్టలతో  దొరికిపోయిన ఓటుకు నోటు దొంగవు నీవు. అదే నీ స్థాయి. పనికిమాలిన శపథాలు చేయడం, పత్తాలేకుండా  పారిపోవడం నీకు వెన్నతో పెట్టిన విద్య. అసెంబ్లీలో, జనసభలో ప్రతిచోటా కాంగ్రెస్ జలద్రోహాన్ని ఎండగడతాం. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రానికి నష్టం జరుగుతుంటే  చూస్తు ఊరుకోం. ఆత్మగౌరవం లేని ఢిల్లీ బానిసలం కాదు మేము. రైతన్నల హక్కులకు భంగం కలిగతే భగ్గున మండుతాం. జనం అన్నీ గమనిస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడు తొక్కి నారతీస్తారు. 2028లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమని'' కేటీఆర్‌ రాసుకొచ్చారు. 

Advertisment
తాజా కథనాలు