ఇవాళ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడీగా జరిగాయి. ఇందులో బీఆర్ఎస్ - కాగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ముఖ్యంగా రైతు భరోసా అంశం పై ఇరు పార్టీలు వాధించుకున్నాయి. ఇందులో భాగంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ఊరిలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే.. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా వెంటనే ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ చేశారు. శాసనసభలో రైతుభరోసాపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
Also Read: Ap: ఏపీ మందుబాబులకు గుడ్‌న్యూస్.. భారీగా మద్యం ధరలు తగ్గింపు
ఏకకాలంలో రుణమాఫీ చేస్తానన్నారు
అసెంబ్లీ ఎన్నికలకు ముందు రుణాలు తెచ్చుకోండి అని.. డిసెంబర్ 9న రుణమాఫీపై మొదటి సంతకం పెడతానని రేవంత్ రెడ్డి అన్నారన్నారు. ఏకకాలంలో ఒకటే పెన్ స్ట్రోక్‌తో రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారన్నారు. అంతేకాకుండా డిసెంబర్ 7న స్టేట్ లెవల్ బ్యాంకర్స్ మీటింగ్‌లో రుణమాఫీ కోసం రూ. 49 వేల 500 కోట్లు అని చెప్పారన్నారు. ఎక్కడో సీఎం మాట్లాడుతూ.. ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే రుణమాఫీ చేసేస్తాం.. రూ. 40 వేల కోట్లు కట్టేస్తాం అన్నారని గుర్తు చేశారు.
ఏ ఊరికైనా పోదాం
సీఎం రూ. 40 వేల కోట్లు అంటే.. కేబినెట్‌కు వచ్చే వరకు రూ. 31 వేల కోట్లు అయిందని, అది బడ్జెట్‌కు వచ్చేసరికి రూ. 26 వేల కోట్లు అయిందని ఆరోపించారు. అది కాస్త మొన్న జరిగిన పాలమూరు విజయోత్సవ సభలో రూ. 19 వేల కోట్లు అని సీఎం చెప్పారన్నారు. ఈ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నాం.. ఈ రాష్ట్రంలో ఏ ఊరికైనా పోదామని.. కొండారెడ్డిపల్లే, సిరిసిల్ల, పాలేరు వాళ్లకి ఇష్టం ఉన్న ఊరికి పోయి రుణమాఫీ గురించి అడుగుదామన్నారు.
రాజీనామా ఇచ్చేస్తా
ఏ ఒక్క ఊరిలో నైనా వంద శాతం రుణమాఫీ జరిగిందని చెబితే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా వెంటనే ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటా అని సవాల్ విసిరారు. ఈ రకమైన బుకాయింపు, మోసం ప్రభుత్వానికి మంచిది కాదని ధ్వజమెత్తారు. రుణమాఫీ చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ మండిపడ్డారు.
Also Read: Uthappa: మాజీ క్రికెటర్ ఉతప్పకు భారీ షాక్..అరెస్ట్ వారెంట్ జారీ
మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలి
రైతుబంధు ఎందుకు ఆగిపోతది అని రేవంత్ రెడ్డి అన్నారని.. మరి వానకాలం రైతుబంధు ఎందుకు ఎగ్గొట్టారని కేటీఆర్ ప్రశ్నించారు. అప్పట్లో మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారన్నారు. ఇప్పుడు మేం కూడా మూడు పంటలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అని పేర్కొన్నారు. కౌలు రైతుకు, భూ యజమానికి రైతుబందు ఇస్తామన్నారని.. తప్పకుండా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి అని తెలిపారు.
Also Read: CBN: జగన్ కు చంద్రబాబు బర్త్ డే విషెస్.. ఏమని ట్వీట్ చేశారో తెలుసా?
మాట నిలబెట్టుకోలేదు
మొదటి వంద రోజుల్లోనే రైతుభరోసా ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. అప్పుడేమో అందరికి అని చెప్పి ఇప్పుడేమో కొందరికి అని కోతలు పెట్టారన్నారు. రైతుభరోసాకు బడ్జెట్‌లో రూ. 15 వేల కోట్లు కేటాయించారన్నారు. అయితే అది సరిపోదని.. 70 లక్షల మంది రైతన్నలకు రూ. 23 వేల కోట్లు కావాలని తెలిపారు. రైతుబంధు కోతలకు సిద్దపడ్డ తర్వాతనే కేబినెట్ సబ్ కమిటీ వేశారని మండిపడ్డారు.
రైతుబంధు పథకానికి ఉరి వేయబోతున్నారు
మంత్రివర్గ ఉపసంఘం వేసి టైం పాస్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వానకాలం రైతుబంధు ఎగ్గొట్టినట్టే.. ఇప్పుడు కూడా రైతుబంధు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మేనిఫెస్టోలో కోతల గురించి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో కోటి పైచిలుకు పాన్ కార్డులు ఉన్నాయని.. వీళ్లకు కట్ చేస్తామంటే ఎలా..? ఐటీ కట్టే వాళ్లకు కట్ చేస్తామంటే ఎలా..? అని ప్రశ్నించారు. రైతుబంధు పథకానికి ఉరి వేయబోతున్నారని.. అదే తమ అనుమానం అని కేటీఆర్ పేర్కొన్నారు.
Also Read: Ap School Holidays: ఏపీలో భారీ వర్షాలు..స్కూళ్లకు సెలవులు