తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరగనున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన పార్ములా-ఈ కార్ రేసు నిర్వహణలో ఉల్లంఘణలు జరిగాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. పార్ములా-ఈ కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు ఫైల్ పంపింది. తాజాగా గవర్నర్ నుంచి ఆమోదం రావడంతో నేడు కేటీఆర్ అరెస్ట్ కావడం ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. పార్ములా-ఈ కార్ నిర్వహణ సంస్థకు విదేశీ కరెన్సీ రూపంలో ఒప్పందానికి ముందు నిధులు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇది కూడా చూడండి: నా రికార్డ్‌లు కావాలంటే గూగుల్‌లో వెతకండి– బుమ్రా గత ప్రభుత్వ సమయంలో.. ఇది నిబంధనలకు విరుద్ధమని విచారణ చేపట్టాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి సంస్థ ఏసీబీకి ఫిర్యాదు చేసింది. హెచ్‌ఎండీఏ అనుమతి లేకుండా ఈ కారు సంస్థకు రూ. 46 కోట్లు విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించారు. దీంతో అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, చీఫ్ ఇంజినీరుతో పాటు గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అనుమతివ్వాలని ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రాసింది. ఈ అంశంపై న్యాయ సలహా తీసుకున్న అనంతరం గవర్నర్ అనుమతిచ్చారు. ఇది కూడా చూడండి: ట్రూడోకు షాక్.. ఉప ప్రధాని రాజీనామా పార్ములా-ఈ కారు రేస్ పై ఈ ఏడాది ఆరంభంలోనే పురపాలక శాఖ కమిషనర్ అర్వింద్ కుమార్‌ను నోటీసులు పంపించారు. అలాగే చీఫ్ ఇంజనీర్‌ను కూడా ఏసీబీ విచారించింది. అప్పటి మంత్రి కేటీఆర్ ప్రోద్బలంతోనే విదేశీ కంపెనీకి నిధుల బదిలీ చేశామని వెల్లడించారు. అయితే తాజాగా కేటీఆర్‌పై కేసు నమోదుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో మళ్లీ ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏసీబీ విచారణ జరిపితే కేటీఆర్ అరెస్ట్ అవ్వడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల ఈ విషయమై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మాట్లాడుతూ కేటీఆర్‌ను అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. ఇది కూడా చూడండి: తానుపారిపోవాలని అనుకోలేదు.. మొదటిసారి స్పందించిన అసద్ తన అరెస్టుకు సంబంధించి ఇప్పటికే కేటీఆర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. తాను ఏ కేసులకు భయపడేది లేదని.. అవసరమైతే అరెస్ట్ చేసుకున్నా పర్లేదని గతంలోనే ప్రకటించారు. ప్రతి విషయంలో అనుమతి ఇచ్చింది.. సంతకం చేసింది తానే అని స్పష్టం చేశారు. ఈ రేసింగ్ సమయంలో మున్సిపల్ శాఖ మంత్రిగా తానే ఉన్నానని, ఎఫ్‌ఈవోకు డబ్బులు చెల్లించడం వాస్తవమేనని అది హైదరాబాద్ పేరును అంతర్జాతీయస్థాయిలో నిలిపేందుకు తీసుకున్న నిర్ణయమని తెలిపారు. ఒకవేళ నేడు కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే తెలంగాణ రాజకీయాలు కీలక మలుపు తీసుకునే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇది కూడా చూడండి: ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా.. రేవంత్ సర్కార్ కీలక అప్డేట్!