/rtv/media/media_files/2025/06/16/da42SGy2f6BHI6K611Vl.jpg)
If they put me in jail, I will take a rest, Says KTR
తెలంగాణ శాసనసభ స్పీకర్ శివ ప్రసాద్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీం కోర్టులో ధిక్కార పిటిషన్ వేశారు. పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోనందుకు కేటిఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జూలై 3న కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. మూడు నెలల గడువులోగా పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై యాక్షన్ తీసుకోవాలి. అయినా పార్టీ ఫిరాయించిన 10 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్పీకర్ కోర్టు తీర్పుని ధిక్కరించారని ఆయన భావించి సుప్రీంకోర్టుకు వెళ్లారు.
Contempt Plea In Supreme Court Against Telangana Speaker For Not Deciding Disqualification Petitions Against Defected BRS MLAs#SupremeCourt#Telanganahttps://t.co/ktM50mBiXY
— Live Law (@LiveLawIndia) November 10, 2025
స్పీకర్ కోర్టు ధిక్కార పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని కేటీఆర్ సుప్రీం కోర్టును కోరారు. బీఆర్ఎస్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ ధర్మాసనం ఈ పిటిషన్ గురించి ప్రస్తావించారు. సుప్రీం కోర్టు CJI ఈ పిటిషన్‌పై వచ్చే సోమవారం విచారణ చేపడతామని తెలిపారు. నవంబర్ 23న CJI గవాయ్ పదవీ విరమణ ఉంది. ఈనేపథ్యంలో ఈ కేసు అప్పటివరకు సాగదీస్తున్నారని న్యాయవాది మోహిత్ రావు తెలిపారు. నవంబర్ 24 తరువాత కూడా సుప్రీంకోర్టు ఉంటుంది కదా అని సీజేఐ చెప్పుకొచ్చారు.
తెలంగాణలోని పార్టీ ఫిరాయించిన పది మంది BRS ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలంటూ గతంలో BRS నాయకులు KT రామారావు, పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ప్రకారం ఎమ్మెల్యే ల అనర్హతను కోరుతూ దాఖలైన పిటిషన్లను మూడు నెలల వ్యవధిలోగా నిర్ణయించాలని జులై 31న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మూడు నెలలు గడిచినా స్పీకర్ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు.
Follow Us