మినీ అంగన్‌వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి: కేటీఆర్

తెలంగాణలో మినీ అంగన్‌వాడీ టీచర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అప్‌గ్రేడ్‌ వేతనాలతో సహా పెండింగ్‌ బిల్లులు కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

KTRRR
New Update

తెలంగాణలో మినీ అంగన్‌వాడీ టీచర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అప్‌గ్రేడ్‌ వేతనాలతో సహా పెండింగ్‌ బిల్లులు కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మినీ అంగన్‌వాడీ టీచర్ల ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు తెలంగాణ మినీ అంగన్‌వాడీ టీచర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఆదివారం కేటీఆర్‌ను కలిశారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షరురాలు ఆడెపు వరలక్ష్మీ, ప్రతినిధులు రేణుక, శివమ్మ,లక్ష్మీ, మల్లిక తదితరులు తమ సమస్యలు కేటీఆర్‌కు విన్నవించారు. 

Also Read: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి..ఈ జాగ్రత్తలు తప్పనిసరి మరి

సంఘం  ప్రతినిధులు కేటీఆర్‌కు ఇలా వివరించారు. '' రాష్ట్రంలో మారుమూల పల్లెలు, గిరిజన తండాల్లో చిన్నారులకు, గర్భిణులకు పౌష్టికాహారం అందించడం కోసం రాష్ట్రంలో 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఒకరే టీచర్‌గా ఉంటూ ఆహార పంపిణీ, పిల్లల సంరక్షణ, విద్యా కార్యక్రమాలు చేపట్టడం, బీఎల్‌వో డ్యూటీలు, సర్వేలు, పల్స్‌పోలియోవంటి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 

Also Read: ఖమ్మంలో రాక్షస తల్లి.. 12 రోజుల పసిబిడ్డను ఏం చేసిందంటే?

ప్రస్తుతం హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జనవరి నెల నుంచి ప్రధాన అంగన్‌వాడీ టీచర్లతో సమానంగా రూ.13,650 నెలవారి జీతం ఇవ్వడం ప్రారంభించారు. కానీ మార్చి నుంచి మళ్లీ పాత వేతనమైన రూ.7,800 మాత్రమే అందిస్తున్నారు. దీంతో మినీ అంగన్‌వాడీ టీచర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భవన కిరాయిలు, కూరగాయల బిల్లులు, ఇతర ఖర్చులు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని'' సంఘం ప్రతినిధులు తెలిపారు. దీంతో కేటీఆర్‌.. అంగన్‌వాడీ, మినీ అంగన్‌వాడీ టీచర్ల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాలను ప్రస్తావించి ప్రభుత్వం చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని చెప్పారు.   

Also Read: శబరిమలకు పోటెత్తిన స్వాములు.. పంబ వరకూ క్యూలైన్!

Also Read: కేసీఆర్ మిత్రుడు, మాజీ ఎమ్మెల్యే కన్నుమూత!

 

#ktr #telugu-news #anganvadi #Anganwadi teachers
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe