ఖమ్మంలో రాక్షస తల్లి.. 12 రోజుల పసిబిడ్డను ఏం చేసిందంటే?

ఖమ్మం జిల్లాలో ఓ కసాయి తల్లి తన బిడ్డను బేరం పెట్టింది. విషయం తెలుసుకున్న ICDS అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. విషయం పోలీసులకు తెలియడంతో బ్రోకర్ సహా ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

New Update

ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఏమైనా కష్టం వచ్చిందో.. పెంచి పెద్ద చేయలేను అనుకుందో తెలియదు కానీ.. ఓ తల్లి తన 12 రోజుల పసి బిడ్డను అమ్మకానికి పెట్టింది. లక్షా ఇరవై వేలకు బేరం పెట్టింది. అయితే.. విషయం ఐసీడీఎస్ అధికారులకు తెలియడం ఆమె ప్లాన్ ఫెయిల్ అయ్యింది. విషయం పోలీస్ స్టేషన్ కు చేరింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కల్లూరు మండలం పుల్లయ్య బంజర రోడ్‌ కు చెందిన రుక్మిణి అనే మహిళ తన బిడ్డను అమ్మాలని నిర్ణయించింది.
ఇది కూడా చదవండి: ఆర్టీసీ బస్సులో ఉరేసుకున్న యువకుడు.. టికెట్ తీసుకుని!

రూ.1.20 లక్షలకు బేరం..

ఇందు కోసం ఓ బ్రోకర్ ను సంప్రదించింది. విషయం తెలుసుకున్న సత్యవతి అనే మహిళ ఆ బిడ్డను కొనేందుకు బేరానికి వచ్చింది. రూ.1.20 లక్షలకు బేరం కుదుర్చుకుంది. అయితే.. ఈ విషయం ఐసీడీఎస్ అధికారులకు తెలియడంతో వారు రంగంలోకి దిగారు. శిశువును అమ్ముతుండగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత శిశువును పోలీసులకు అప్పగించారు. దీంతో విచారణ చేసిన పోలీసులు.. బ్రోకర్ సహా ముగ్గురు మహిళలపై కేసు నమోదు చేశారు. 
ఇది కూడా చదవండి: నిద్రిస్తున్న భర్తను గొడ్డలితో నరికిన భార్య.. అలా చేసినందుకే!

Advertisment
Advertisment
తాజా కథనాలు