KTR: కేటీఆర్‌ ఢిల్లీ టూర్‌పై బీజేపీ మౌనం.. కారణమేంటి?

అమృత్ స్కీమ్ టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదు చేసేందుకు కేటీఆర్ ఢిల్లీ టూర్ పై తెలంగాణ బీజేపీ నేతలు సైలెంట్ గా ఉండడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఫిర్యాదుకు కేంద్రం ఎలా రెస్పాండ్ అవుతుందనే అంశం హాట్ టాపిక్ గా మారింది.

New Update

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేపట్టిన ఢిల్లీ టూర్‌పై తెలంగాణ బీజేపీ మౌనం పాటించడం అనుమానాలకు తావిస్తోంది. అమృత్‌ స్కీం టెండర్లపై ఆ పార్టీ ముఖ్య నేతలు ఇంత వరకు స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేటీఆర్ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇవ్వకపోవడంపై రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. తెలంగాణలో అమృత్ స్కీం టెండర్లలో అవకతవకలు జరిగాయని కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారు. ఇదే వ్యవహారంలో కేంద్ర మంత్రి ఖట్టర్‌కు ఫిర్యాదు చేశారు. అమృత్ టెండర్లకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు నోరు విప్పడం లేదు. ఈ అంశంపై బీజేపీ నేతలు దాటవేత ధోరణి అవలంభించడంపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ సాగుతోంది. రేవంత్ రెడ్డితో బీజేపీ నేతలు కలిసిపోయారని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నారు. కేటీఆర్ ఫిర్యాదు నేపథ్యంలో బీజేపీ నేతల రియాక్షన్‌ ఎలా ఉంటుందనేదానిపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

ఇది కూడా చదవండి: పోలీసులే కారణం.. లగచర్ల ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు సంచలనం!

గవర్నర్ కోర్టులో బంతి..

ప్రివెన్షన్ ఆఫ్‌ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 17ఏ ప్రకారం మంత్రిగా పని చేసిన కేటీఆర్ ను విచారించాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి గవర్నర్ కు ప్రభుత్వం నుంచి లేఖ రాసింది. అయితే.. గవర్నర్ ఇందుకు సంబంధించి అటార్నీ జనరల్ కు లేఖ రాశారు. అటార్నీ జనరల్ సూచన ప్రకారం గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే.. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగానే అటార్నీ జనరల్, గవర్నర్ నడుచుకుంటారన్న ప్రచారం సాగుతోంది.
ఇది కూడా చదవండి: KTR: కలెక్టర్ పై దాడి కేసులో కేటీఆర్, ఆ కీలక నేత హస్తం.. విచారణలో సంచలనాలు?

అటార్నీ జనరల్ గవర్నర్ కు ఈ కింది మూడు సూచనల్లో ఏదో ఒకటి ఇచ్చే అవకాశం ఉంది..
1. విచారణలో అప్పటి మంత్రులను పక్కన పెట్టాలని..
2. నిధుల మళ్లింపులో బిజినెస్ రూల్స్ ను బ్రేక్ చేయలేదని..
3. కేటీఆర్ పై విచారణ జరపొచ్చు..

Also Read :  అరెస్టులు ఖండిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి..డీజీపీకి జేఏసీ ఫిర్యాదు

Also Read :  ఆ కడుపు మంటతోనే చేశాడు.. కొడంగల్ ఘటనపై పట్నం నరేందర్ రియాక్షన్!

Advertisment
తాజా కథనాలు