బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారా? చేస్తే ఎప్పుడు చేస్తారు? తెలంగాణ పాలిటిక్స్ లో గత కొన్ని రోజులుగా సాగుతున్న చర్చ ఇది. ఇటీవల కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అనుమతి ఇవ్వాలని గవర్నర్ కు ప్రభుత్వం లేఖ రాయడంతో ఈ అంశంపై చర్చ మరింత తీవ్రమైంది. వాస్తవానికి కేటీఆర్ నిన్న మలేషియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే.. ఆయన ఆఖరి నిమిషంలో తన పర్యటనను రద్దు వేసుకున్నారు. తాను ఇంట్లోనే సిద్ధంగా ఉన్నానని ప్రభుత్వ ఏజెన్సీలు ఎప్పుడైనా రావొచ్చని తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. దీంతో కేటీఆర్ అరెస్ట్ అంశం మరింత హాట్ టాపిక్ గా మారింది. మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. అరెస్ట్ అంటే తనకు భయం లేదని ఓ రెండు నెలలు జైలులో ఉండి ట్రిమ్ అవుతానని చెప్పుకొచ్చారు. తద్వారా అరెస్టుకు మానసికంగా సన్నద్ధమయ్యానన్న సంకేతాలు ఇచ్చారు కేటీఆర్.
ఇది కూడా చూడండి: Amla: కార్తీక మాసంలో ఇంట్లో ఈ మొక్క నాటితే.. ఐశ్వర్య సిద్ధి తధ్యం!
మంత్రి పొంగులేటి సియోల్ పర్యటన ఉన్న సమయంలో రాష్ట్రంలో భారీ అరెస్టులు ఉంటాయని.. త్వరలో పొలిటికల్ బాంబ్ పేలుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్న ఖమ్మం పర్యటనలోనూ ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అణుబాంబు పేలబోతుందన్నారు. తప్పు చేసింది చిన్న దొరనా.. లేక పెద్దదొరనా.. ఎవరైనా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. దీంతో కేసీఆర్, కేటీఆర్ లో ఒకరి అరెస్ట్ ఉండబోతుందని పరోక్షంగా చెప్పుకొచ్చారు పొంగులేటి. ప్రభుత్వంతో పాటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ కేటీఆర్ అరెస్ట్ పై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఎప్పుడైనా ఆయన అరెస్టు ఉండొచ్చన్న ప్రచారం సాగుతోంది.
Also Read: Minister Sridhar Babu: మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో చోరీ
గవర్నర్ అనుమతి తప్పనిసరి..
హైదరాబాద్ లో గతేడాది నిర్వహించిన ఫార్ములా ఈ-కార్ రేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న చర్చ చాలా రోజులుగా సాగుతోంది. అయితే.. ఇందుకు సంబంధించి కేటీఆర్ పై ప్రీవెన్షన్ ఆఫ్ కరెప్షన్ (PC) యాక్ట్ అమలు చేయాల్సి ఉంటుంది. అయితే.. ఈ చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం ప్రభుత్వ ఉన్నతాధికారులు, మంత్రులు తదితర కీలక స్థానాల్లో ఉండి వారు తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై ఈ చట్టం కింద కేసు నమోదు చేయాలంటే సంబంధిత శాఖ అధిపతుల నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మంత్రిగా ఉండి కేటీఆర్ అవకతవకలకు పాల్పడ్డాడని అభియోగాలు ఉండడంతో.. విచారణకు ప్రభుత్వానికి అధిపతి అయిన గవర్నర్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.
ఇది కూడా చూడండి: తొలి టీ20లో భారత్ విజయం.. అదరగొట్టిన శాంసన్
ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్ కు లేఖ రాసింది. అయితే.. నిబంధనల ప్రకారం గవర్నర్ అంగీకారం తెలపడానికి మూడు నెలలు సమయం తీసుకోవచ్చు. గ్రేస్ పిరియడ్ కింద మరో నెల రోజులు సమయం తీసుకోవచ్చు. ఈ లోగా ఎప్పుడైనా గవర్నర్ తన సమ్మతి తెలియజేయవచ్చు. అయితే.. ప్రత్యేక పరిస్థితుల్లో తప్పా.. సాధారణంగా గవర్నర్లు ఇలాంటి విచారణకు అంగీకారం చెబుతుంటారు. ఈ నేపథ్యంలో త్వరలోనే విచారణకు అంగీకారం చొప్పొచ్చనే ప్రచారం సాగుతోంది. గవర్నర్ ఓకే చెప్పిన వెంటనే ఏసీబీ ఈ వ్యవహారంలో కేటీఆర్ పై కేసు నమోదు చేసి మరింత దూకుడుగా వెళ్లే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. అనంతరం కేటీఆర్ అరెస్ట్ అవుతారన్న చర్చ కూడా సాగుతోంది.
ఇది కూడా చూడండి: ఇక్కడ చేసిన ఫుడ్ తిన్నారో.. ఒక్కసారికే పైకి పోవడం గ్యారెంటీ!