నాంపల్లి స్పెషల్ కోర్టులో స్టేట్‌మెంట్‌ ఇచ్చిన కేటీఆర్.. ఏమన్నారంటే ?

నాంపల్లి స్పెషల్ కోర్టుకు కేటీఆర్ హాజరయ్యారు. జడ్జి ముందు ఆయన తన స్టేట్‌మెంట్ ఇచ్చారు. కొండా సురేఖ తనపై చేసిన వ్యాఖ్యల కాపీని సమర్పించారు. రాజకీ కక్షతోనే తనపై లేనిపోని ఆరోపణలు చేశారని.. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

KTR 3
New Update

నాంపల్లి స్పెషల్ కోర్టుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. జడ్జి ముందు ఆయన తన స్టేట్‌మెంట్ ఇచ్చారు. కొండా సురేఖ తనపై చేసిన వ్యాఖ్యల కాపీని సమర్పించారు. రాజకీ కక్షతోనే తనపై లేనిపోని ఆరోపణలు చేశారని కేటీఆర్ అన్నారు. తనకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తితో సంబంధం అంటగట్టారని.. సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. బాధ్యత గల పదవిలో ఉన్న మహిళా మంత్రి తన పరువుకు భంగం కలిగించారని తెలిపారు. నేను డ్రగ్ అడిక్ట్ అని, రేవ్ పార్టీలు నిర్వహిస్తానని, ఫోన్ ట్యాపింగ్ చేశానని కొండా సురేఖ మాట్లాడారని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే నాపై ఆరోపణలు చేశారంటూ దాదాపు 30 నిమిషాల పాటు కేటీఆర్‌ తన స్టేట్‌మెంట్‌ను ఇచ్చారు. కేటీఆర్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను కోర్టు రికార్డు చేసింది. 

Also Read: హైదరాబాద్‌లో మరోసారి కూల్చివేతలు.. గుండెల్లో గుబులు!

నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు.. తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపిన సంగతి తెలిసందే. దీంతో తనపై నిరాధార ఆరోణలు చేసినందుకు కేటీఆర్ ఆమెపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. అయితే ఇటీవల వ్యవహారంపై కోర్టులో విచారణ జరిగింది. న్యాయస్థానం దీనిపై వివరణ ఇవ్వాలని కేటీఆర్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే బుధవారం కోర్టుకు హాజరై తన స్టేట్‌మెంట్‌ను ఇచ్చారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్టతకు దెబ్బతీసేలా ఉన్నాయని ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. 

Also Read: డిసెంబర్లోనే తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్.. ఆ నేత పేరు ఫైనల్!?

మరోవైపు అక్కినేని నాగార్జున కూడా కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై కూడా విచారణ కొనసాగుతోంది. అక్టోబర్ 8వ తేదిన నాగుర్జునా, సాక్షిగా ఉన్న సుప్రియ స్టేట్‌మెంట్‌లను కోర్టు రికార్డు చేసింది. వాళ్ల స్టేట్‌మెంట్‌లు తీసుకున్న అనంతరం మంత్రి కొండా సురేఖకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది.  

 

 

#brs #ktr #telangana #konda-surekha #actress-samantha
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe